రాష్ట్రపతి ఎన్నికపై ఏకమైన విపక్షాలు: ఎన్డీఏ తర్వాతే తామన్న మమత, నితీష్ డుమ్మా
రాష్ట్రపతి అభ్యర్థిపై ఎన్డీఏ నిర్ణయం తీసుకున్న తర్వాతే తాము తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిపై ఎన్డీఏ నిర్ణయం తీసుకున్న తర్వాతే తాము తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. విపక్షాల తరఫున ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టేందుకు యత్నిస్తున్న విపక్ష పార్టీలు న్యూడిల్లీలో శుక్రవారం సమావేశమయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. విపక్ష సభ్యులకు ఆమె విందు కూడా ఇచ్చారు. కాగా, ఈ సమావేశానికి దాదాపు 17 పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై వారు చర్చించారు. అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై సమాలోచనలు సాగుతున్నాయని వెల్లడించారు.

ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తాము తుది నిర్ణయం చెబుతామని తెలిపారు. వారు ప్రకటించే అభ్యర్థి అందరికీ ఆమోదయోగ్యమైతే తమకెలాంటి అభ్యంతరం లేదని మమత పేర్కొన్నారు. అయితే, ఈ సమావేశానికి జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, సమాజ్ వాదీ పార్టీ నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌లు గైర్హాజరవడం గమనార్హం.
కాగా, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి ఇప్పటి వరకూ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టే అంశంపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్డీయే అభ్యర్థికే మద్దతిస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే రెండు వర్గాలు కూడా బీజేపీ అభ్యర్థికే మద్దతు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications