రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల : జూలై 18న ఎన్నిక - ఓటింగ్.. ఓటు విలువ ఇలా..!!
భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసారు. వచ్చే నెల జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అవసరమైతే జూలై 21న కౌంటింగ్ నిర్వహిస్తారు. జూలై 24వ తేదీ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లను ఈ నెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. జూన్ 30న స్క్రూటినీ జరగనుంది. జూలై 2 వరకు నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం ఉంటుంది. ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే నెల 25వ తేదీతో ముగియనుంది.

ఓటింగ్ హక్కు..ఎవరెవరికి ఛాన్స్
వచ్చే నెల 24వ తేదీ లోగా ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సీఈసీ ప్రకటించారు. పార్లమెంట్ ... రాష్ట్రాల అసెంబ్లీల సభ్యులు కలిసి ఎలక్టోరల్ కాలేజీగా రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. లోక్ సభలోని 543 మంది సభ్యులు..233 మంది రాజ్యసభ సభ్యులు కలిపి 776 మంది ఓటింగ్ హక్కు కలిగి ఉన్నారు. అదే విధంగా 4,120 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలోని సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ సభ్యుల ఓటు హక్కు విలువ ఎక్కువగా ఉంది. ఆ తరువాత మహారాష్ట్ర..పశ్చిమ బెంగాల్ సభ్యుల ఓటు హక్కు విలువ ఎక్కువగా ఉంటుంది.

ఓటింగ్ విధానం ఇలా..
ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో..అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు తమ సంబంధిత అసెంబ్లీ ప్రాంగణంలో ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందని సీఈసీ స్పష్టం చేసారు. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ అవకాశం లేదు. లోక్ సభ జనరల్ సెక్రటరీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10,86,431 ఓట్లు ఉన్నట్లుగా సీఈసీ ప్రకటించారు. 5,34,680 ఓట్లు దక్కిన వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నిక అవుతారు. అభ్యర్ధి నామినేషన్ వేసే సమయంలో 50 మంది మద్దతుగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ... పర్యావరణ పరిరక్షణ చర్యలతో ఎన్నికలను నిర్వహిస్తామని సీఈసీ వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ విలువ..
పార్లమెంట్ లోని మొత్తం 776 మంది ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. అదే విధంగా ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 గా నిర్ధారించారు. రాష్ట్రాల వారీగా ఎమ్మెల్యే ఓటు అత్యధికంగా 208 గా ఖరారు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ సభ్యుల సంఖ్య 403 కావటంతో అక్కడ మొత్తం ఎమ్మెల్యేల ఓటింగ్ విలువ 83,824 గా నిర్దారించారు. ఇతర రాష్ట్రాల్లో అక్కడి జనాభా ఆధారంగా నిర్ణయిస్తారు. ఏపీ లో 175 మంది ఎమ్మెల్యేలు.. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్నానరు. నామినేటెడ్ - శాసన మండలి సభ్యులకు ఇందులో ఓటు హక్కు వేసే అవకాశం లేదు. ఇక, అభ్యర్ధుల ప్రకటన తరువాత రెండు రాష్ట్రాల్లో ఎవరు ఎవరికి మద్దతు ఇచ్చేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

విప్ జారీకి అవకాశం ఉండదు
6వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నుంచి బాధ్యతలు చేపట్టిన వారందరూ జులై 25వ తేదీనే ప్రమాణస్వీకారం చేశారు. కొత్తగా ఎంపిక కానున్నా రాష్ట్రపతి కూడా అదే తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వచ్చే నెల జూలై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికకు పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీచేయకూడదు. ఓటేయడానికి, గైర్హాజరు కావడానికి ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పటివరకూ ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఈ సారి ఎన్నిక ఏకగ్రీవం చేస్తారా లేక పోటీ ఉంటుందా అనేది తేలాల్సి ఉంది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications