పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గు: హైదరాబాద్ రేట్ ఇదీ: అక్కడ కొత్త రికార్డ్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతోంది. వాటి రేట్ల భారం వాహనదారులపై వరుసగా పడుతూనే ఉంది. రేట్లను పెంచే విషయంలో చమురు కంపెనీలు వెనక్కి తగ్గట్లేదు. ఇవ్వాళ కూడా ఇంధన రేట్లను సవరించాయి. పెట్రోల్‌పై 80 పైసలు, డీజిల్‌పై 70 పైసల అదనపు భారాన్ని మోపాయి. ఫలితంగా పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటర్ ఒక్కింటికి 110 రూపాయలను దాటింది. ముంబైలో 115 రూపాయలకు పైగా పలుకుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలను చమురుసంస్థలు తొలి రోజు లీటర్‌పై 80 పైసల మేర పెంచిన విషయం తెలిసిందే. అదే ధరను కొనసాగిస్తోన్నాయి. ఇవ్వాళ్టి వరకు అదే ధరను కొనసాగిస్తోన్నాయి. ఇప్పుడు కూడా పెట్రోల్‌పై 80 పైసలను పెంచాయి. డీజిల్‌పై 70 పైసల భారాన్ని మోపాయి. 137 రోజుల సుదీర్ఘ విరామానికి బ్రేక్ ఇచ్చిన చమురు సంస్థలు.. అప్పుడు నెలకొన్న లోటును ఇప్పుడు భర్తీ చేసుకునేలా వాహనదారుల వీపు విమానం మోత మోగిస్తూనే ఉన్నాయి.

పెరిగిన ధరల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.100.21 పైసలకు చేరింది. డీజిల్ రూ.91.47 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ115.04 పైసలు, డీజిల్ రూ.99.25 పైసలుగా నమోదైంది. కోల్‌కతలో పెట్రోల్ రూ.109.68 పైసలు, డీజిల్ రూ.94.62 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.105.94 పైసలు, డీజిల్ 96 రూపాయలకు చేరింది. బెంగళూరులో పెట్రోల్ రూ.105.62 పైసలు, డీజిల్ రూ.89.70 పైసలుగా ఉంటోంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.113.61 పైసలు, డీజిల్ 99.84 పైసలు.
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర విపరీతంగా పెరిగిపోవడం వల్లే చమురు సంస్థలు ఆ భారాన్ని వాహనదారులపై మోపాయి. యుద్ధం ఆరంభమైన 40 శాతం క్రూడాయిల్ ధర పైకి ఎగబాకింది. యుద్ధం ఆరంభం కావడానికి ముందు రోజులతో పోల్చుకుంటే- ఈ రేటూ చాలా ఎక్కువ. పెరిగిన క్రూడాయిల్ ధరల ప్రభావం భారత్‌పైనా పడింది. ఫలితంగా నాలుగు రోజుల్లో మూడోసారి ఇంధన రేట్లను పెంచాల్సి వచ్చినట్లు చమురు సంస్థలు చెబుతున్నాయి. ఈ పెరుగుదల ఇక్కడితో ఆగడం దాదాపు అసాధ్యమే.












Click it and Unblock the Notifications