ఆ హీరోతో బయటపడ్డ శ్రీలీల ప్రేమ వ్యవహారం ..లవ్ సింబల్‌తో క్లారిటీ ఇచ్చేసిందిగా..!
టాలీవుడ్ సెన్సేషనల్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కార్తీక్ ఆర్యన్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఇద్దరి పేర్లే వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్, టాలీవుడ్ సర్కిల్స్‌లో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వార్తలపై ఇద్దరూ పెదవి విప్పకపోయినప్పటికీ.. తాజాగా జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఈ రూమర్స్‌కు మరింత నెయ్యి పోసినట్లయింది.
ఇటీవలే శ్రీలీల పుట్టినరోజును పురస్కరించుకుని కార్తీక్ ఆర్యన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ఫొటో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఆ ఫొటోలో కార్తీక్ బైక్ నడుపుతుండగా.. వెనుక కూర్చున్న శ్రీలీల బైక్ రియర్ వ్యూ మిర్రర్‌లో చూసుకుంటూ క్యూట్‌గా నవ్వుతూ కనిపించారు. ఈ రేర్ అండ్ బ్యూటిఫుల్ పిక్‌ను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే శ్రీ శ్రీ అంటూ కార్తీక్ పెట్టిన క్యాప్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. కార్తీక్ పెట్టిన ఈ బర్త్‌డే పోస్ట్‌కు శ్రీలీల ఇచ్చిన రిప్లై ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కార్తీక్ పోస్ట్‌ను రీ-షేర్ చేస్తూ.. థాంక్యూ స్వీటెస్ట్ అని రిప్లై ఇచ్చింది. అంతటితో ఆగకుండా ఆ మెసేజ్ చివరలో ఒక లవ్ సింబల్ కూడా జోడించింది. ఈ ఒక్క లవ్ ఎమోజీతో నెటిజన్లు, అభిమానులు రకరకాల లెక్కలు వేసేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కాదు.. అంతకుమించి ఏదో నడుస్తోందని, శ్రీలీల ఇండైరెక్ట్‌గా తమ ప్రేమపై హింట్ ఇచ్చేసిందని సోషల్ మీడియాలో నెటిజన్లు గట్టిగా చర్చించుకుంటున్నారు.
నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో త్వరలోనే ఒక క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ బసు దర్శకత్వంలో ఒక ప్యూర్ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అది కాస్తా ప్రేమగా మారిందని టాక్. మరి ఈ క్రేజీ పెయిర్ మధ్య ఉన్నది కేవలం సినిమా ప్రమోషన్ స్టంటా? లేక నిజంగానే దిల్ వాలేల మధ్య ప్రేమాయణం సాగుతోందా? అనేది తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు అధికారికంగా స్పందించాల్సిందే.












Click it and Unblock the Notifications