ఆ లెక్క తేల్చండి.. నా రాజీనామా గురించి మాట్లాడండి - రేవంత్ సంచలనం..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 'విశ్వనగరం'గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లక్ష్యంగా ఘాటుగా స్పందించారు. కేసీఆర్- కేటీఆర్ పైనా విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు రేవంత్ రాజీనామా చేస్తారా అంటూ కిషన్ చేసిన సవాల్ కు సీఎం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'మోదీ హామీల లెక్క తేల్చండి.. ఆ తర్వాత నా రాజీనామా గురించి మాట్లాడండి' అంటూ సవాల్ చేసారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ముందుగా సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేసారు. దేశ ప్రజలకు ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ హామీలు ఎంతవరకు అమలయ్యా యో దేశ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, ప్రతి ఖాతాలో రూ.15 లక్షల జమ వంటి కీలక హామీలు నెరవేర్చకపోయినా వాటిపై ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. తన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కిషన్‌రెడ్డి ముందుగా వీటికి సమాధాని చెప్పాలని నిలదీశారు. ఎన్నికల హామీలు అమలు కాలేదనే కారణంతో ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడితే, తాను కూడా తన కేబినెట్‌ను రద్దు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం స్పష్టం చేశారు.

కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాంగ్రెస్ హయాంలో రూ.15వేల కోట్లతో ఈ మెట్రో పనులకు పునాది పడిందని ఆయన గుర్తుచేశారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు తీవ్రంగా ఆలస్యమైందని సీఎం ఆరోపించారు. సమస్యలపై మాట్లాడదామంటే కేంద్రమంతి కిషన్‌రెడ్డి సమయం ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకుని మాట్లాడాలని సూచించారు. మెట్రో విస్తరణకు కిషన్‌రెడ్డి నిధులు విడుదల చేయిస్తారా? లేదా? అని ప్రశ్నించారు. లోన్ బదిలీ కాకుండా కిషన్‌రెడ్డి వల్లే మెట్రో విస్తరణ ఆగిందని ఆరోపించారు. మెట్రో విస్తరణకు రూ.40 వేల కోట్లు కావాలని సూచించారు. అంతా తామే భరిస్తామని.. NOC ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం లేకుండా మెట్రోను తాము విస్తరిస్తామని కేంద్ర పెద్దలతో తాము చెప్పామని పేర్కొన్నారు. కాగా, రాజకీయంగా నష్టం జరుగుతోందని మెట్రోపై కిషన్‌రెడ్డి కుట్ర పన్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.













Click it and Unblock the Notifications