Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Petrol and Diesel Price Today: ఇంధన ధరలు మళ్లీ ఆకాశానికి: లీటర్ డీజిల్ రూ.110: హైదరాబాద్‌లో రేట్లివీ..

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. వాటి రేట్లు ఇవ్వాళ పెరిగాయి. రెండు రోజుల విరామం తరువాత చమురు సంస్థలు ఇంధన ధరలను పెంచేశాయి. ఫలితంగా వాటి రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇంధన ధరలను పెంచే విషయంలో చమురు సంస్థలు ఏ మాత్రం వెనుకాడట్లేదు. వాహనదారులపై అదనపు భారాన్ని మోపుతూనే ఉన్నాయి. అసలే కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల రూపంలో వీపు విమానం మోత మోగుతోంది.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్‌‌, డీజిల్‌పై 35 పైసల మేర పెంపుదల కనిపించింది. లీటర్ ఒక్కింటికి 35 పైసల మేర పెంచడాన్ని బెంచ్‌మార్క్‌గా పెట్టుకున్నట్టు కనిపిస్తోన్నాయి చమురు కంపెనీలు. ఇదివరకు మూడుసార్లు ఇదే రేటుతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఇప్పుడు మళ్లీ 35 పైసల మేర సవరించాయి. రికార్డుస్థాయి పెరుగుదల ఇది. తాజాగా పెరిగిన ధరలతో దేశంలోని అనేక నగరాల్లో లీటర్ పెట్రోల్ 115 రూపాయలను దాటింది. డీజిల్ వంద రూపాయల మార్క్‌ను దాటేసింది.

దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.106.19 పైసలకు చేరింది. డీజిల్ 94.92 పైసలుగా నమోదైంది. ముంబైలో పెట్రోల్ రూ.112.11 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్‌ ధర వంద రూపాయలను దాటింది. రూ.102.89 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ.103.31 పైసలు, డీజిల్‌ ధర రూ.99.26 పైసలుగా నమోదైంది. పెట్రోల్ అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం మూడు రూపాయల మేర పన్నును తగ్గించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయినట్టయింది. వరుసగా పెంచుతోన్న ధరల వల్ల ఇప్పుడు అక్కడ కూడా పెట్రోల్ ధర వంద రూపాయల మార్క్‌ను ఎప్పుడో దాటేసింది. ఇక డీజిల్ వంద రూపాయలకు చేరువైంది.

Prices of petrol and diesel rise by 35 on October 20, 2021: Check rates in your city here

కాగా- తాజా పెంపుతో కోల్‌కతలో పెట్రోల్ ధర రూ.106.77 పైసలుగా నమోదైంది. డీజిల్‌ ధర రూ.98.03 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.109.89, డీజిల్ రూ.100.73 పైసలు, లక్నోలో పెట్రోల్ రూ.103.18 పైసలు, డీజిల్ రూ.95.37 పైసలకు చేరింది. భోపాల్‌లో పెట్రోల్ రూ.114.81 పైసలు, డీజిల్-104.15 పైసలు పలుకుతోంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.110.46 పైసలు, డీజిల్ రూ.103.56 పైసలు పలుకుతోంది. విజ‌య‌వాడ‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.112.58 పైసలు, డీజిల్ ధ‌ర రూ.104.87 పైసలకు చేరింది.

గాంధీనగర్‌లో పెట్రోల్ రేటు రూ.103.11 పైసలు, డీజిల్ రూ.102.52 పైసలు, తిరువనంతపురంలో పెట్రోల్ రూ.108.44 పైసలు, డీజిల్ రూ.102.03 పైసలుగా నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 117.17 పైసలకు చేరింది. డీజిల్ రేటు 106.34 పైసలు. శ్రీగంగానగర్‌లో పెట్రోల్ 119 రూపాయలు, డీజిల్ 110 రూపాయలకు చేరువయ్యాయి. ఈ పెరుగుదల ఇక్కడితో ఆగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకమైంది. ఇక్కడితో ఆగలానూ కనిపించట్లేదు. ఇదివరకట్లా మళ్లీ వరుసగా వాటి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచబోవనే గ్యారంటీ ఉండట్లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+