ఆ దేవాలయాలు పాటిదార్లకు ప్రైడ్ అండ్ పవర్

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: పాటిదార్లలో రెండు సామాజిక వర్గాలు ఉన్నాయి. లీవా, కడ్వా పాటిదార్లు.. గుజరాతీ గొప్పతనానికి, అధికార కేంద్రానికి నిదర్శనంగా నిలిచాయి. గుజరాత్ అసెంబ్లీ తొలి దశ పోలింగ్‌కు మూడు రోజులు గడువు మాత్రమే ఉంది. ఖోదాల్ ధామ్, ఉమియా దేవాలయాలు గొప్పతనానికి, పట్టుదలకు నిలువుటద్దంగా ఉన్నాయి. ఆయా సామాజిక వర్గాలను ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యం ఈ లైవా, కడ్వా పాటిదార్లకు ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఖోదాల్ ధామ్ దేవాలయాన్ని రాజ్‌కోట్ జిల్లాలో లీవా పాటిదార్లు నిర్మించారు. ఉత్తర గుజరాత్ రాష్ట్రంలోని మెహ్సానా జిల్లాలో ఉమియా ధామ్ గుడిని కడ్వా పాటిదార్లు నిర్మించారు. అయితే రెండు దేవాలయాలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెండేళ్ల నుంచి నిర్మించిన ఈ రెండు దేవాలయాలు సంబంధిత సామాజిక వర్గాలు అధికార కేంద్రాలుగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 దేవాలయాలకు గుజరాత్ రాష్ట్ర రాజకీయాలు నిదర్శనం

దేవాలయాలకు గుజరాత్ రాష్ట్ర రాజకీయాలు నిదర్శనం

ఖోదాల్ ధామ్ దేవాలయాన్ని దినేశ్ చోవాటియా, రవీభాయి అంబాలియా ట్రస్టులుగా ఉన్నారు. రాజ్ కోట్ సౌత్, జెత్పూర్ అసెంబ్లీ స్థానాల నుంచి దినేశ్, రవీభాయి కాంగ్రెస్ పార్టీ తరుఫున గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరో ట్రస్టీ గోపాల్ భాయి వత్సాపరా కూడా అమ్రేలీ జిల్లాలోని లాథిబాబ్రా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ టిక్కెట్ నుంచి పోటీ చేస్తున్నారు. గుజరాత్‌లోని దేవాలయాలు తరుచుగా రాజకీయాలకు కారణం అవుతున్నాయి. 1990 నుంచి అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 2002లో మరోసారి అయోధ్యకు వెళ్లి వస్తున్న యాత్రికుల రైలు ‘సబర్మతి ఎక్స్‌ప్రెస్' బోగీని గోద్రాలో దగ్ధం చేసిన ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మారణ హోమం జరిగింది.

 రాజకీయంగా తటస్థంగా ఉంటామన్న ఖోదాల్‌ధామ్ ట్రస్టీ

రాజకీయంగా తటస్థంగా ఉంటామన్న ఖోదాల్‌ధామ్ ట్రస్టీ

శ్రీ ఖోదాల్ ధామ్ ట్రస్ట్ చైర్మన్ నరేశ్ భాయి పటేల్ గత వారం పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్‌తో సమావేశం అయ్యారు. తనతో జరిగిన చర్చల్లో నరేశ్ భాయి పటేల్‌ సందేహాలు నివ్రుత్తి చేసుకున్నారని హార్దిక్ పటేల్ తెలిపారు. కానీ ఖోదాల్‌ధామ్ దేవాలయం ట్రస్ట్ రాజకీయంగా తటస్థంగా ఉంటుందని పేర్కొన్నది. హార్దిక్ పటేల్ గణనీయ స్థాయిలో పాటిదార్లు పేదలు గణనీయంగా ఉన్నారని ట్రస్ట్ అంగీకరించింది. నరేశ్ భాయి పటేల్ ఏనాడు ప్రజలతో సంబంధాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. హార్దిక్ పటేల్‌తో నరేశ్ భాయి ఫోటో దిగేందుకు అంగీకరించారు.

 పటేళ్లకు ప్రీతిపాత్రం ఆ రెండు దేవాలయాలు

పటేళ్లకు ప్రీతిపాత్రం ఆ రెండు దేవాలయాలు

హార్దిక్ పటేల్ రిజర్వేషన్ డిమాండ్‌కు ఖోదాల్‌ధామ్ ట్రస్ట్ మద్దతు పలుకుతూనే ఉన్నది. కానీ హార్దిక్ రాజకీయ విజయంతోనే అది సాధించాలని కోరుకుంటున్నారు. అందుకే పాటిదార్లంతా ఆయనతో కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నారు. నరేశ్ భాయి పటేల్ కూడా లీవా పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారు. పాటిదార్లలో లీవా సామాజిక వర్గం 70 శాతం ఉంటారు. ఈ నేపథ్యంలో మీడియా ముందు హార్దిక్ పటేల్, నరేశ్ భాయి పటేల్‌తో కలిసి ఫోటో దిగారు. హార్దిక్ పటేల్ కడ్వా పాటిదార్ కావడం గమనార్హం. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొటములను ఇదొక్కటి మాత్రమే నిర్ణయించలేదని విశ్లేషకులు అభిప్రాయ డపతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీకి అధికారానికి పటేళ్లు కేంద్రంగా నిలిచారు. పాటిదార్లలోని రెండు సామాజిక వర్గాలు తమకు ప్రీతిపాత్రమైన దేవుళ్లకు ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు.

ప్రారంభోత్సవం

ప్రారంభోత్సవం

ఈ రెండు దేవాలయాల ప్రారంభోత్సవం నాడు లక్షల మంది పాటిదార్లు వాటిని సందర్శించడం ఆనవాయితీగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ దేవాలయాలతోపాటు ఈ రెండు దేవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేశారు. ఆయా దేవాలయాల ట్రస్టీలతోనూ సమావేశమయ్యారు. నరేశ్ భాయి పటేల్‌తో రాహుల్ గాంధీ భేటీ అయిన వెంటనే గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా ఆ ఆలయాన్ని సందర్శించారు. ఈ రెండు దేవాలయాలను సమానంగా పరిగణిస్తున్నామని కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు అభిప్రాయ పడుతున్నారు.

ఖోదాల్‌ధామ్, ఉమియా‌ధామ్ గుళ్లు నిర్మించిందీ పటేళ్లే

ఖోదాల్‌ధామ్, ఉమియా‌ధామ్ గుళ్లు నిర్మించిందీ పటేళ్లే

బీజేపీతో అసంత్రుప్తికి గురైన ప్రజలతంతా తాజాగా రాజకీయంగా పునరేకీకరణ దిశగా అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఖోదాల్ ధామ్, ఉమియా దేవాలయాలను సంపన్నులైన పాటిదార్లు నిర్మించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, అమలు చేస్తున్న పథకాలపై ప్రజలు నిరాశకు గురి చేస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు. దేవాలయాల ప్రభావాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తున్నది. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మొదలు పార్టీ నేతలంతా సదరు దేవాలయాల ట్రస్టీలతో సమావేశం అవుతూ, దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. తమకు తిరిగి అధికారాన్ని కట్టబెడితే పాటిదార్ల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. లీవా, కడ్వా సామాజిక వర్గాల వారికి ‘పటేల్' అని పేరు ఉంటుంది. పాటిదార్లు 18 శాతం ఉంటారు. కానీ రెండు సామాజిక వర్గాల మధ్య అరుదుగా వివాహాలు జరుగుతాయి. పాటిదార్ల మద్దతు కూడగట్టడానికి కేశూభాయి పటేల్ శత విధాలు ప్రయత్నిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
While the Leuva Patidars are mostly concentrated in Saurashtra, Central and South Gujarat the Kadva Patidars are hail mostly from North Gujarat. The Khodaldham Temple and Umiya Dham temple have become centres of power and pride for two sects of the Patidar community.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X