ప్రధాని మోడీ సంచలన నిర్ణయం: అన్ని రాష్ట్రాల సీఎంలతో రేపు భేటీ.. రీజన్ ఏంటంటే!!
భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రేపు సమావేశం కానున్నారు. ఏప్రిల్ 27వ తేదీన బుధవారం రోజు అన్ని రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్న ప్రధాని నరేంద్ర మోడీ కరోనా మహమ్మారి కేసుల పెరుగుదల నేపధ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పెరుగుతున్న ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఏప్రిల్ 27న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.

అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమావేశం ..పాల్గొననున్న కేంద్ర మంత్రులు
ప్రధాని వివిధ రాష్ట్రాల సీఎంలతో నిర్వహించే ఈ సమావేశంలో ప్రధానమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మరియు వారి సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితిపై ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారని నివేదించబడింది.

రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలపై మోడీ సమావేశం
ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి, ముఖ్యంగా బూస్టర్ డ్రైవ్ మరియు కొన్ని రాష్ట్రాల్లో కేసుల పరిస్థితిని గురించి కూడా ఈ సమావేశంలో మాట్లాడనున్నారు. వివిధ రాష్ట్రాలలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు గతంలో ప్రధాని మోదీ సీఎంలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోమారు కరోనా కేసులు పెరుగుతున్న తీరు, రాష్ట్రాలలో మాస్కులు పెట్టుకోవాలని, కరోనా నిబంధనలను పాటించాలని విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు.

దేశంలో కరోనా ఆందోళన.. ఓమిక్రాన్ సబ్ వేరియంట్ ల వల్ల పెరుగుతున్న కేసులు
ఇదిలా ఉంటే దేశంలో కరోనా కేసులు గత కొద్ది రోజుల నుండి 2 వేలకు పైగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 2,483 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 2,541 కేసుల కంటే కొంచెం తక్కువగా నమోదయ్యాయి. క్రియాశీల కేసులు కూడా 16,522 నుండి 15,636కి తగ్గాయి. అయితే పాజిటివిటీ రేటు 0.55 శాతంగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓమిక్రాన్ సబ్ వేరియంట్ల వల్ల కరోనా వ్యాప్తి కొనసాగుతున్నట్టు తెలుస్తుంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications