ది కేరళ స్టోరీ సినిమాపై విరుచుకుపడిన మోదీ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తారా ?
బళ్లారి/బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో పనిలోపనిగా వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ సినిమాపై ప్రధాని నరేంద్ర మోదీ బళ్లారిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులను తయారు చెయ్యడానికి ఇలాంటి సినిమాలు తీస్తున్నారా ? అని ప్రధాని నరేంద్ర మోదీ ఆ చిత్ర యూనిట్ ను ప్రశ్నించారు.
ది కేరళ స్టోరీ సినిమా గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. దశాభ్దాలుగా ఉగ్రవాదులు వలన సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉగ్రవాదాన్ని అంతం చెయ్యడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, అయినా ఉగ్రవాదులు ఏదో ఒకరకంగా రెచ్చిపోతూనే ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ఉగ్రవాదులు బాంబులతో, తుపాకులతో వారి ఉనికిని చాటుకుంటారని, ఆ శభ్దం అందరికి వినపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అయితే అలాంటి ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేలా ది కేరళ స్టోరీ సినిమాను నిర్మించడం చాలా దారుణంగా ఉందని, సైలెంట్ గా సినిమా రూపంలో ఉగ్రవాదాన్ని ఈసినిమా ప్రోత్సహించినట్లు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
కేరళ ఎంతో పుణ్యభూమి, ఆ రాష్ట్ర ప్రజలు కష్టజీవులు, శ్రామికులని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అలాంటి కేరళ రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించలేలా ది కేరళ స్టోరీ సినిమా తియ్యడం దారుణం అని ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి లోలోపల ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూనే ఉందని, అందుకే వాళ్లకు ఇలాంటి విషయాలు పట్టవని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.

ది కేరళ స్టోరీ సినిమాను బ్యాన్ చెయ్యడానికి కేరళ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ది కేరళ స్టోరీ సినిమాను బ్యాన్ చెయ్యాలని కేరళలోని కొందరు మంత్రులు. పలు పార్టీల రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వివాదాస్పద సినిమా అయిన ది కేరళ స్టోరీ సినిమా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మండిపడుతున్నారు. అయితే ఓ వర్గంలోని కొందరు మాత్రం ది కేరళ స్టోరీ సినిమాను బ్యాన్ చెయ్యకూడదని అంటున్నారు.












Click it and Unblock the Notifications