బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Modi: ప్రధాని మోదీ టూర్ లో పోలీసు అధికారి ఓవర్ యాక్షన్, అక్కడ వదిలేసి ఇక్కడ మాత్రం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలోని హుబ్బళి పర్యటన సందర్బంగా పోలీసులకు అందరూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో సందర్బంలో ఓ యువకుడు రోడ్డు పక్కన బ్యారికేడ్లు దాటుకుని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ మెడలో పూలహారం వెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. అయితే మోదీ రోడ్ షోలో నిర్లక్షంగా ఉన్న పోలీసులు హుబ్బళి ఎయిర్ పోర్టు సమీపంలో ఓవర్ యాక్షన్ చేసి చిన్న పాపతో బైక్ లో వెలుతున్న వ్యక్తి గూబ పగలగొట్టారు.

Reddy: వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న గాలి జనార్దన్ రెడ్డి ?, సేమ్ సీన్ రిపీట్, ఆరోజు వైఎస్ ఫ్యామిలీ, ఇప్పుడు !Reddy: వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న గాలి జనార్దన్ రెడ్డి ?, సేమ్ సీన్ రిపీట్, ఆరోజు వైఎస్ ఫ్యామిలీ, ఇప్పుడు !

 మోదీ భద్రతా సిబ్బంది సీరియస్ ?

మోదీ భద్రతా సిబ్బంది సీరియస్ ?

ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరకు సామాన్యలు వెళ్లడానికి ఎలాంటి అవకాశం లేదు. ప్రధాని నరేంద్ర మోదీకి అతి దగ్గరగా వెళ్లిన యువకుడు ఎవరు ? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా సిబ్బంది సైతం కర్ణాటక పోలీసుల మీద గుర్రుగా ఉన్నారని తెలిసింది. అదే ఇదే సందర్బంలో హుబ్బళి సిటీ పోలీస్ ఇన్స్ పెక్టర్ ఓవర్ యాక్షన్ చేసి అడ్డంగా బుక్కైపోయాడు.

 అక్కడ వదిలేసి ఇక్కడ మాత్రం ?

అక్కడ వదిలేసి ఇక్కడ మాత్రం ?

గురువారం హుబ్బళి-ధారవాడ జంట నగరాల్లో జాతీయ యువజనోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యువజనోత్సవాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హుబ్బళి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న ఎయిర్‌పోర్టు రోడ్డుపై విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారి అదే సమయంలో అటువైపు బైక్‌పై వెళ్లే వ్యక్తిపై విరుచుకుపడ్డాడు. చిన్నారితో కలిసి బైక్ మీద వెలుతున్న వ్యక్తి చెంప చెల్లుమనిపంచిన ఇన్‌స్పెక్టర్‌ తరువాత ఆయన గూబపలగొట్టేశాడని ఆరోపణలు ఉన్నాయి.

 గూబ గుయ్ మనింది

గూబ గుయ్ మనింది

హుబ్బళి విమానాశ్రయం ప్రవేశ ద్వారం సమీపంలో బైక్ లో పాపతో కలిసి వెలుతున్న వ్యక్తి చెంప పగలగొట్టడటం హాట్ టాపిక్ అయ్యింది. రోడ్డు మీదకు రావడానికి మమ్మల్ని ఎవ్వరు అడ్డూకోలేదని, అయితే తనపాటికి తాను వెలుతున్న సమయంలో తన పాప ముందే ఇన్స్ పెక్టర్ తన మీద చెయ్యి చేసుకున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

 టైమ్ బ్యాడ్ అంటున్న బాధితుడు

టైమ్ బ్యాడ్ అంటున్న బాధితుడు

రోడ్ షో సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరకు వెలుతున్న సమయంలో పోలీసులు అతన్ని పట్టుకోలేదని, ప్రధాని మోదీ భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారని, అయితే ఇక్కడ ప్రధాని మోదీ అక్కడికి రాకముందు బైక్ లో వెలుతున్న అమాయకుడి మీద పోలీసు అధికారి చెయ్యి చేసుకోవడం విడ్డూరంగా ఉందని సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన జాతీయ యువజనోత్సవాలు జనవరి 16 వరకు జరగనున్నాయి. వికాసిత్ యువ -వికాసిత్ భారత్ పేరుతో జరిగే ఈ యువజనోత్సవంలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు.

English summary
Prime Minister Narendra Modi's visit, police inspector who overacted in Hubballi in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X