కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Private Bus: రెచ్చిపోయి బస్సు నడిపిన డ్రైవర్, ఐదు మంది మృతి, రూ. 5 లక్షలు పరిహారం, తెలుగోడు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ తమకూరు: ప్రతిరోజు సంచరించే ప్రైవేట్ బస్సు ఎప్పటిలాగే బయలుదేరింది. బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. ప్రతిరోజు సంచరించే మార్గంలో ప్రైవేటు బస్సును డ్రైవర్ వేగంగా నడిపాడు. ఆ సమయంలో బస్సులో ఉన్న కొందరు ప్రయాణికులు బస్సు వేగం తగ్గించాలని, ఇలా వేగంగా వెళితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని డ్రైవర్ కు చెప్పారని, బస్సు కండెక్టర్ ను మందలించారని తెలిసింది. అయితే బస్సు డ్రైవర్ మాత్రం వేగంగా తగ్గించకుండా బస్సును ఇంకా వేగంగా నడిపాడని తెలిసింది. ఇదే సమయంలో వేగంగా వెలుతున్న బస్సు మార్గం మద్యలో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదంలో ఓ తెలుగు వాడు ఉన్నాడు. విషయం తెలుసుకున్న సీఎం, హోమ్ మంత్రి, రవాణా శాఖా మంత్రి, మాజీ సీఎంలు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 25 మందికి తీవ్రగాయాలైనాయని, వారిలో 7 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అంటున్నారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారికి, తీవ్రగాయాలైన వారికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్షం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

Illegal affair: విదేశాల్లో భర్త, బెడ్ రూమ్ లో బావ, ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ?, బావిలో భర్త శవం !Illegal affair: విదేశాల్లో భర్త, బెడ్ రూమ్ లో బావ, ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ?, బావిలో భర్త శవం !

 ప్రైవేట్ బస్సు

ప్రైవేట్ బస్సు

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో వైవీ. హోస్ కోటే పట్టణం నుంచి పావగడకు ప్రతిరోజు ఓ ప్రైవేట్ బస్సు ( ఎస్ వీటీ బస్సు సంచరిస్తోంది. ప్రతిరోజు సంచరించే ప్రైవేట్ బస్సు ఎప్పటిలాగే శనివారం ప్రయాణికులతో బయలుదేరింది. బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.

 రెచ్చిపోయి బస్సు నడిపిన డ్రైవర్

రెచ్చిపోయి బస్సు నడిపిన డ్రైవర్

ప్రతిరోజు సంచరించే మార్గంలో ప్రైవేటు బస్సును డ్రైవర్ వేగంగా నడిపాడు. ఆ సమయంలో బస్సులో ఉన్న కొందరు ప్రయాణికులు బస్సు వేగం తగ్గించాలని, ఇలా వేగంగా వెళితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని డ్రైవర్ కు చెప్పారని, బస్సు కండెక్టర్ ను మందలించారని తెలిసింది. అయితే బస్సు డ్రైవర్ మాత్రం వేగంగా తగ్గించకుండా బస్సును ఇంకా వేగంగా నడిపాడని ప్రయాణికులు అంటున్నారు.

 ఐదు మంది ప్రాణాలు పోయాయి

ఐదు మంది ప్రాణాలు పోయాయి

ఇదే సమయంలో వేగంగా వెలుతున్న బస్సు మార్గం మద్యలో వై.ఎన్. హోస్ కోటే- పావగడ మద్యలోని పళవళ్ళి కట్టే సమీపంలో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పావగడ తాలుకాలోని పుతగానహళ్లి నివాసి అమూల్య (16), వైఎన్. హోస్ కోటే నివాసి కల్యాణ్ )18), సోలనాయకనహళ్ళి అజిత్ (28), ఆంధ్రప్రదేశ్ లోని బెస్తరపల్లికి చెందిన షాన్ వాజ్ (18)తో పాటు మరో వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 సీఎం, మంత్రులు షాక్

సీఎం, మంత్రులు షాక్

తీవ్రగాయాలైన 25 మందిని తమకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో 7 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్, హోమ్ మంత్రి, రవాణా శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు, మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి తదితరులు విచారం వ్యక్తం చేశారు.

 బస్సు డ్రైవర్ నిర్లక్షం..... రూ. 5 లక్షలు పరిహారం

బస్సు డ్రైవర్ నిర్లక్షం..... రూ. 5 లక్షలు పరిహారం

ఈ ప్రమాదంలో 25 మందికి తీవ్రగాయాలైనాయని, వారిలో 7 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అంటున్నారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారికి రూ. 5 లక్షలు, తీవ్రగాయాలైన వారికి రూ. 50 వేలు చొప్పున ప్రభుత్వం పరిహారం అందిస్తుందని కర్ణాటక రవాణా శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు మీడియాకు చెప్పారు. ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్షం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

English summary
Tumakuru Private Bus Accident: At least 5 people were killed when a private bus Accident near the Palavalli Katte of Pavagada taluk in Tumakuru district. Transport Minister B Sriramulu Declared Rs 5 Laksh compensation for Deceased Family Members and Rs 50 Thousand compensation for Injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X