• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రైవేటు పాఠశాలలపై లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చిన్న బడులకు పెద్ద కష్టం

By BBC News తెలుగు
|
దేశంలో చాలా పాఠశాలల్లో ఆన్ లైన్ విద్యా బోధన జరుగుతోంది

ఉదయం తొమ్మిది గంటలు అవుతుంది. 10 ఏళ్ల నవ్య స్కూల్ యునిఫారమ్ వేసుకొని తయారు అయ్యి అమ్మకి టాటా చెప్పి పడక గదిలోకి వెళ్లింది. తన స్కూల్ టైమ్ అయ్యింది. నవ్య హైదరాదబాద్ లో ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటుంది. "ఇప్పుడు ఇదే మా దినచర్య. పిల్లలు ఒక గదిలో ఆన్‌లైన్‌లో పాఠాలు వింటారు మేము ఒక గదిలో మా పని చేసుకుంటాము" అని వివరించారు పద్మ.

కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పటం మెదలు పెట్టాయి. కాని చిన్న పాటి ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 12,000 వరకు ప్రేవేట్ పాఠశాలలు ఉన్నాయి. అందులో దాదాపు 8 వేల వరకు బడ్జెట్ పాఠశాలలే. వీటిల్లో వార్షిక రుసుము తరగతులను బట్టి రూ.4,000 నుంచి రూ. 25,000 వరకు ఉంటాయి. 2020-21 విద్యా సంవత్సరంలో దాదాపు 2000 వరకు బడ్జెట్ పాఠశాలలు మూతపడతాయని తెలంగాణ గుర్తింపు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం(ట్రస్మా) చెబుతోంది. వీటిల్లో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల పై ప్రభావం ఎక్కువగా ఉందని అంటున్నారు ట్రస్మా ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి.

ఫీజులు వసులు కాక... అద్దెలు భరించలేకే...

మార్చి నెలాఖరు నుంచి పరీక్షలు పూర్తికాకుండానే పాఠశాలలు లాక్ డౌన్లో ఉన్నాయి. విద్యార్థుల నుంచి మార్చి-ఏప్రిల్ నెలలో వసూలు కావలసిన ట్యూషన్ రుసుములు ఆగిపోయాయి. నెలనెలా భవనాలకు అద్దె..విద్యుత్తు.. నీటి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అదీ కాక ఉపాధ్యులకు, సిబ్బందికి ఇవ్వాల్సిన జీతాలు, వాహనాల రుణంపై ఈఎంఐలు... చెలించాల్సి ఉంటుంది. ఇవి చెల్లించటం భారంగా మారి, నూతన విద్యా సంవత్సరంలో బడులను నడపటం తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నాయి కొన్ని పాఠశాలల యాజమాన్యాలు.

ఇదే పరిస్తితిలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల యజమాని బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ.. "నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో నేను స్కూల్ పెట్టి ౩౦ సంవత్సరాలు అవుతోంది. మా పాఠశాలలో దిగువ మధ్య తరగతి అంత కంటే తక్కువ ఆర్థిక స్తోమత గల కుటుంబాల నుంచి చదువుకోవటానికి వచ్చే విద్యార్థులే ఎక్కువ శాతం. వారిలో చాలా మందికి ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితి. స్కూలుకు ఇవ్వాల్సిన రుసుము బాకీ కోసం ఒత్తిడి ఎలా చేయగలము?" అన్ని అంటున్నారు.

"మళ్లీ పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. ఆన్ లైన్ తరగతులు నిర్వహిద్దామంటే మా పాఠశాలలో చదివేవారు పేద కుటుంబాలకు చెందిన వారు ఎక్కువ. వారికి ఆన్ లైన్ తరగతులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఉండవు. మరి రుసుములు రాకా, పాఠశాలలు తెరుచుకోక, బడి ఎలా నిలబెట్టేది? అందుకే కొంత మంది సిబ్బందికి తప్పనిసరై వేరే కొలువులు చూసుకోవాలని చెప్పాను. ఒక వేళ పాఠశాల తెరిస్తే వారిని తిరిగి తీసుకుంటాని చెప్పాను" అన్నారు రంగా రెడ్డి జిల్లాలోని ఓ పాఠశాల యజమాని.

ఇప్పటికే ఇంటర్నేషనల్, కార్పొరేట్ పాఠశాలల నుంచి పోటీని తట్టుకుంటూ నడుస్తున్న చిన్న ప్రైవేట్ పాఠశాలలకు కరోనా మరింత సవాలుగా మారిందటుంన్నారు ట్రస్మా ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి.

పాఠశాలలో చేసే ఉపాద్యాయులు కొలువు లేక వేరే దారి చూసుకుంటున్నారు. మరో దారి లేక ఒకరు ఉపాధి హామీ పనులకు వెళ్తుంటే మరొకరు బండి మీద ఇడ్లీ అమ్ముతున్నారు. నిరుద్యోగిగా ఉండే కంటే పొట్టకూటి కోసం ఏదోఒక పని చేస్తే తప్పులేదు అంటున్నారు పాఠాలు చెప్పే ఈ ఉపాద్యాయులు.

మరో వైపు ఈ బడ్జెట్ పాఠశాలలో చదివే విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. ఒక అపార్ట్‌మెంటుకి కాపదారుడిగా పని చేస్తున్న నాగబాబు తన ఇద్దరు పిలల్ని ఇంటి దగ్గర ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. కానీ ఇప్పుడు పాఠశాల తెరవలేమని యాజమాన్యం చెప్పటంతో తెలిసిన వారి సహాయంతో మరో పాఠశాలలో పిల్లల్ని చేర్పించారు. "ఖర్చుకి ఇబ్బందైనా సరే అని స్కూల్ మార్చాను కానీ ఇక్కడ ఆన్ లైన్ క్లాసులు అంటున్నారు. ఇప్పుడు చెరొక ఫోన్ ఎలా కొనిపెట్టేది? వీరి భవిష్యత్తు కోసమే పట్నం వచ్చా కాని ఇంత పోటి ఎలా తట్టుకునేది?" అన్నారు.

అసలు ప్రైవేట్ పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం ఏమి చేయాలి, ఆన్ లైన్ క్లాసులు నిర్వహించవచ్చా లేదా అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. కొన్ని సెంట్రల్ సిలబస్ పాఠశాలలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తూ రుసుము చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయని తల్లిదండ్రులు విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

దీనిపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Private schools face trouble with lock down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X