వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెంట్రల్ విస్టా ప్రాజెక్టే ముఖ్యం.. వైద్యారోగ్యం గాలికి, మోడీ సర్కార్‌పై ప్రియాంక నిప్పులు

|
Google Oneindia TeluguNews

సమయం దొరికితే చాలు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడతాయి ప్రతిపక్షాలు. కరోనా సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటిని ప్రస్తావిస్తూ.. ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కరోనా వేళ.. ఎందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోన్న వేళ.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఎందుకు తగ్గిస్తున్నారని ప్రియాంక గాంధీ అడిగారు. ఐసీయూ గదిలో ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్లు ఎందుకు తక్కువ చేస్తున్నారని అడిగారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఆస్పత్రుల్లో తగిన సౌకర్యాలు లేవని చెప్పారు. ఆక్సిజన్ బెడ్లు 36 శాతం తగ్గించారని పేర్కొన్నారు. ఐసీయూ బెడ్లు 46 శాతం తగ్గించారని.. వెంటిలేటర్ బెడ్లు 28 శాతం తగ్గించారని పేర్కొన్నారు.

Priyanka Gandhi asks why Modi govt. reduced oxygen, ICU and ventilator beds

ఆస్పత్రుల్లో బెడ్లకు సంబంధించి నిపుణుల కమిటీ, పార్లమెంటరీ కమిటీ, వైద్యారోగ్య కమిటీ చెప్పిన ఎందుకు పట్టించుకోలేదని అడిగారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వల్ల జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరూ అని ప్రియాంక గాంధీ అడిగారు. ఈ మేరకు ట్విట్టర్‌లో 45 సెకన్ల నిడివిగల వీడియోను పోస్ట్ చేశారు.

దేశంలో ప్రజల కన్నా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ముఖ్యమా అని ప్రియాంక గాంధీ అడిగారు. పార్లమెంట్ నూతన సముదాయ భవనాన్ని సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. మోడీ అధికారంలోకి వచ్చాక.. వైద్యారోగ్య శాఖకు 20 శాతం బడ్జెట్ తగ్గించారని తెలిపారు. జిల్లా ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పారు. ఎయిమ్స్ కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. కానీ అవన్నీ మరచిపోయారు.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు మాత్ర వారికి ముఖ్యమైపోయిందని అని విరుచుకుపడ్డారు. దానిని 2023 వరకు పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నారని.. భారతీయుల ఆరోగ్యం మాత్రం ఇంపార్టెంట్ కాదని ఫైరయ్యారు.

English summary
Congress general secretary Priyanka Gandhi Vadra on Sunday questioned the Narendra Modi government’s decision to reduce oxygen, ICU and ventilator beds between September last year and January this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X