వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో ప్రియాంకా గాంధీ గంగా యాత్ర ప్రారంభం .. తొలిరోజు పర్యటన ఇలా

|
Google Oneindia TeluguNews

యూపీ రాజకీయాలను మార్చాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వినూత్నంగా గంగా యాత్ర ద్వారా యాదవేతరులను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టారు. ప్రియాంక గాంధీ గంగా యాత్ర ద్వారా అలహాబాద్ నుంచీ వారణాసి వరకూ గంగా నది మీదుగా పర్యటించేలా కాంగ్రెస్ నేతలు ప్లాన్ సిద్ధం చేశారు. యూపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం నుంచీ కొన్ని అనుమతులు రావాల్సి ఉన్నాయి. ఇలా గంగా నది మీదుగా వెళ్లడం ద్వారా ప్రియాంక... యాదవేతరులైన కుష్వాహా, షాక్య, కచహార్, కేవాత్, మల్లా, నిషాద్, కష్యప్, మౌర్య, రాజ్‌భార్ కులాల ప్రజలను కలిసే అవకాశం ఉంటుంది. గంగానది సమీపాన ఎక్కువగా ఉండేది వారే. రాష్ట్రంలోనీ బీసీల్లో 15 శాతం వీళ్లే ఉన్నారు. కాబట్టి వీళ్ళను ఆకట్టుకునే పనిలో భాగంగా ప్రియాంకా గాంధీ గంగా యాత్ర సాగనుంది.

నేటి నుంచి మూడు రోజుల పాటు స్టీమర్‌ బోట్‌ ద్వారా 'గంగా యాత్ర' చేపట్టనున్నారు ప్రియాంకా గాంధీ . గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఆమె పార్టీ తరఫున ప్రచారం చెయ్యనున్నారు . మొత్తం 140 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రయాగ్‌ రాజ్‌ నుంచి వారణాశిలోని అస్సీ ఘాట్‌ వరకు ఈ యాత్ర జరగనుంది. ఆ ప్రాంతాల ప్రజలతో సమావేశం అయి వారి పరిస్థితులను అడిగి తెలుసుకుంటారు. గంగా నది వెంట ఉన్న గ్రామాల్లో ఆమె ప్రచారం చేపడతారు.

రాత్రంతా యూపీ నేతలతో ప్రియాంక గాంధీ భేటీ, బుధవారం ఉదయం గం.5.00 దాకా..రాత్రంతా యూపీ నేతలతో ప్రియాంక గాంధీ భేటీ, బుధవారం ఉదయం గం.5.00 దాకా..

 Priyanka Gandhi Ganga Yatra started in UP... Todays schedule will be....

ప్రియాంకా గాంధీ ప్రయాగ్ రాజ్ లోని బడే హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించి మొదట గంగా సంగమం వద్ద చట్నాగ్ లో గంగా పూజను జరుపుకుని యాత్రను ప్రారంభించారు. ఇక్కడ నుండి, ప్రియాంక యొక్క ప్రయాణం మొదలవుతుంది. ఆమెకు మొదట చట్నాగ్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో దమ్ దమ్ వద్ద స్థానిక కాంగ్రెస్ నాయకత్వం స్వాగతం పలుకుతుంది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక అక్కడ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు. దమ్ దమ్ నుండి, ప్రియాంకా ఇక్కడ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిస్రా వెళతారు, మరియు గ్రామాల ప్రజలతో మాట్లాడతారు. తరువాత ఆమె తుతిహర్ మరియు కౌన్దియార చేరుకుని పుల్వామా అమరవీరుడు మహేష్ రాజ్ యాదవ్ కుటుంబాన్ని కలుసుకుంటారు. రాత్రికి ప్రయాగ్ రాజ్ లో బస చేస్తారు .దీంతో తొలిరోజు పర్యటన ముగుస్తుంది.

English summary
Today, Priyanka started to embark on a three-day Ganga tour from Prayagraj to Varanasi. During her Ganga ride, Priyanka will meet people and also connect with Congress workers. As per the strategy, her focus will be the people like the fishermen community, Bind community and others residing near the banks of the Ganga. Besides, she will also try to dent the upper caste votes of the BJP as she will touch many Rajput and Brahmin dominated villages. She left for Prayagraj late last night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X