Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అనూహ్య ఫలితాలు - జమిలి వేళ కీలక మలుపు..!!

దేశ వ్యాప్తంగా రాజకీయ సందడి కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వం లోని మహాయుతి అధికారం దక్కించుకుంది. జార్ఖండ్ లో అనూహ్యంగా జేఎంఎం కూటమి తిరిగి అధికారంలో కొనసాగనుంది. ఇక, ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లోని అధికార పార్టీలు తమ పట్టు కొనసాగిస్తున్నాయి. వాయనాడ్ లో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. జమిలి దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న వేళ ఈ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి.

ట్రెండ్స్ క్లియర్
ఈ రోజు రెండు రాష్ట్రాలతో పాటుగా ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఎవరు ఎక్కడ విజయం సాధిస్తున్నారనేది దాదాపు స్పష్టత వస్తోంది. మహారాష్ట్ర లో మహాయుతి అధికారం నిలబెట్టుకోగా.. జార్ఖండ్ లో తిరిగి జేఎంఎం కూటమి విజయం ఖాయమైంది. ఇదే సమయంలో పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వాయనాడ్ లోక్ సభ స్థానంలో ఇప్పటి వరకు ప్రియాంక గాంధీకి దాదాపు 1.67 లక్షల మెజార్టీతో కొనసాగుతున్నారు. ఇక్కడ ప్రియాంక భారీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. తొలి నుంచి ఇక్కడ బీజేపీ అభ్యర్ధి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు.

Priyanka Gandhi leads in Wayanad Loksabha seat with huge majority TMC in Bengal continues in leading

ఎవరికి ఎక్కడ ఆధిక్యత
చెన్నపట్టణ నియోజకవర్గంలో నిఖిల్‌ కుమారస్వామి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జేడీఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ సీఎం, ప్రస్తుత కేంద్రమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్
తొలిసారి ఎన్నికల బరిలో నిలవటంతో ఇక్కడ ఫలితం ఆసక్తి కరంగా మారింది. పశ్చిమ బంగాల్ ఉప ఎన్నికల్లో అధికార టీఎంసీదే ఆధిక్యత కొనసాగుతోంది. మేద్నీపూర్‌ ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్థి సుజయ్‌హజ్రా ఆధిక్యంలో ఉన్నారు. నైహతిలో సనత్ ముందంజలో నిలిచారు. ఇక, మదారిహత్‌లో జయప్రకాశ్ టొప్పొ లీడ్ కొనసాగుతోంది. సితాయ్‌ అసెంబ్లీ స్థానంలో సంగీతా రాయ్‌ ఆధిక్యంలో ఉన్నట్లు తాజా ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. అటు, పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ అభ్యర్ధులు ఆధిక్యతలో ఉన్నారు.

Priyanka Gandhi leads in Wayanad Loksabha seat with huge majority TMC in Bengal continues in leading

ఉప ఎన్నికల ఫలితాల్లో
పంజాబ్​లోని బర్నాలా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆప్ అభ్యర్థి హరీందర్ సింగ్ ధాలివాల్ ముందంజలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ సింగ్ ధిల్లాన్‌ పై గట్టి పోటీ ఇచ్చారు. కాగా, బీజేపీ అభ్యర్థి కేవల్ ధిల్లాన్ మూడో స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగినా గిద్దర్‌ బాహా, డేరా బాబా నానక్, చబ్బేవాల్, బర్నాలా అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడవుతున్నాయి. కర్ణాటకలో జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్ చెరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. సండూర్ సెగ్మెంట్‌ లో అధికార కాంగ్రెస్, షిగ్గావ్ లో బీజేపీ, చెన్నపట్నలో జేడీఎస్ ముందంజలో ఉంది. షిగ్గావ్ లో బసవరాజ్ బొమ్మై కుమారుడు భరత్ బొమ్మై, సండూర్‌ లో కాంగ్రెస్‌ అభ్యర్థి అన్నపూర్ణాదేవీ ముందంజలో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+