ఐఐటీ క్యాంపస్ లో చిరుత హల్ చల్.. కుక్క పీక కొరికి.. వీడియో వైరల్

ముంబైలోని ఐఐటీ బాంబే క్యాంపస్ లో షాకింగ్ ఘటన జరిగింది. క్యాంపస్ లోకి చిరుతపులి ప్రవేశించింది. స్టాఫ్ హాస్టల్ వద్ద ఉన్న కుక్కపై దాడి చేసింది. కుక్క పీకను కొరికి దాన్ని పట్టుకుని అక్కడి నుంచి పరార్ అయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనలో విద్యార్థులు, సిబ్బందికి ప్రాణాపాయం తప్పింది. అయితే క్యాంపస్ లోకి చిరుత ప్రవేశించడంపై అటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేల మంది విద్యార్థులు ఉండే ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లో క్రూర మృగాలు సంచరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Cheetah Inside IIT Bombay Viral Video Shows Wild Feline Wandering Through Mumbai Institute Campus

జూన్ 19 శుక్రవారం తెల్లవారు జామున 2 గంటల 30 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు సీసీటీవీలో రికార్డు అయింది. క్యాంపస్ లోని స్టాఫ్ హాస్టల్ వద్ద కారిడార్ లోకి ఒక్కసారిగా చిరుత పులి పరిగెత్తుకుంటూ వచ్చింది. అర్ధరాత్రి కావడంతో విద్యార్థులు, సిబ్బంది అక్కడ లేరు. అయితే కారిడార్ ఓ కుక్క.. ఆ చిరుతను చూసి మొరిగింది. అయితే అప్పటికే గోడ చాటున పొంచి ఉన్న చిరుత ఆహారం కోసం ఎదురు చూస్తోంది. ఇక కుక్క మొరిగిన వెంటనే ఆకలి మీద ఉన్న చిరుత ఒక్కసారిగా శునకం మీదకు దూసుకొచ్చింది. అలా కుక్కపై దాడికి పాల్పడింది. దాని పీక కొరికి ఆ శవాన్ని అక్కడినుంచి లాక్కుని పరిగెత్తింది. ఈ భయానక దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి. చిరుత ఆకలిగా ఉండటంతో క్యాంపస్ లోకి దూరి ఉండొచ్చని అనుమానం కలుగుతోంది.

ఈ ఘటనతో అప్రమత్తమైన క్యాంపస్ అధికారులు విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని.. రాత్రి వేళల్లో, తెల్లవారుజామున క్యాంపస్ లోని బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా జంతువు కదలికలు గమనిస్తే వెంటనే సంబంధిత సిబ్బందికి తెలియజేయాలని చెబుతున్నారు. అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఇప్పుడు క్యాంపస్ లోని విద్యార్థుల భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిష్టాత్మక ఐఐటీల్లోనే విద్యార్థుల పరిస్థితి ఇలా ఉంటే ఇక సాధారణ, మారుమూల హాస్టల్స్ లోని విద్యార్థుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనతో మరోసారి దేశంలోని విద్య వ్యవస్థ, విద్యార్థుల భద్రతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+