ఆమెతో వెళ్లినందుకు గర్వంగా ఉంది : ప్రియాంక గాంధీ
ఫతేపూర్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. యూపీపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఆమె.. సుడిగాలి పర్యటనలో ప్రజలతో మమేకమవుతున్నారు. సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రి నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆమె చాపర్‌లో వెళ్లారు. అయితే ఆ చాపర్‌ను మహిళా పైలెట్ నడుపుతుండటం చూసి ప్రియాంక ఆశ్చర్యపోయారు.

హెలికాప్టర్ నడుపుతున్న మహిళా పైలెట్‌తో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ మహిళ నడిపిన చాపర్‌లో ప్రయాణించడం గర్వంగా ఉందని ప్రియాంక ట్విట్టర్‌లో ట్వీట్ చేయడంతో అది వైరల్ అయింది. రాజకీయ అరంగేట్రం నుంచి ప్రియాంక ఎన్నికల ప్రచారంలో మహిళా సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తుండటం విశేషం.












Click it and Unblock the Notifications