రూటు మార్చిన పీకే-కాంగ్రెస్ పెద్దలతో రహస్య భేటీ..! తాజా వ్యూహాలివే..!
రాజకీయ వ్యూహకర్తగా కెరీర్ ప్రారంభించి, రాష్ట్రాల ఎన్నికల్లో వివిధ పార్టీల్ని గెలిపించి, ఓ దశలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సైతం సిద్దమైన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత వెనక్కి తగ్గి జన్ సురాజ్ పార్టీ స్దాపించారు. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా పావులు కదిపినప్పటికీ ఘోర పరాజయం ఎదుర్కొన్న పీకే.. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీ ఇంటికి వెళ్లారు. ఆమె కుమార్తె, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీతో సుదీర్ఘ చర్చలు జరిపారు. దీంతో కొత్త సమీకరణాలపై చర్చలు మొదలయ్యాయి.
బీహార్ ఎన్నికలలో బీజేపీ, జేడీయూ చేతిలో ఎదురైన ఓటమి తర్వాత.. ప్రియాంక గాంధీ స్వయంగా పీకేను ఇంటికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఓటమి తర్వాత ఇరు పార్టీల నేతలు మౌనంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రియాంకతో పీకే భేటీ కావడంతో జాతీయ స్ధాయిలో కొత్త సమీకరణాలకు బీజం పడిందనే చర్చ జరుగుతోంది. అయితే బహిరంగంగా ఇరువురూ ఈ భేటీని తోసిపుచ్చుతున్నారు.

2017లో పీకే.. పంజాబ్ లో కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ ను తన వ్యూహాలతో సీఎంను చేశారు. అదే ఏడాది యూపీలో మాత్రం కాంగ్రెస్-ఎస్పీ కూటమిని మాత్రం గెలిపించలేకపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి పీకే వస్తారని భావించినా పార్టీ సీనియర్లు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ తో తనకు చేదు అనుభవాలు ఉన్నాయని పీకే కూడా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు తాజా పరిణామాల తర్వాత పీకేకు ఆయన కోరుకున్న స్వేచ్ఛను ఇచ్చేందుకు ప్రియాంక సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ సీనియర్లతో పాటు రాహుల్ మాత్రం ఇందుకు ఇష్టపడటం లేదని సమాచారం.

ప్రస్తుతం వచ్చే ఏడాది కాంగ్రెస్ తమిళనాడు, బెంగాల్, అసోం ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంది. అలాగే 2027లో యూపీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంది. దీంతో తిరిగి పీకే కాంగ్రెస్ తో జట్టుకట్టేందుకు ఈ చర్చలు జరిపినట్లు సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. అయితే 2029 సార్వత్రిక ఎన్నికల లక్ష్యంతో పనిచేసేందుకు పీకే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా మరో ప్రచారం జరుగుతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications