యుపి ఎన్నికల్లో ప్రియాంక గాంధీ తురుపు ముక్క

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ ఎట్టకేలకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీని రాజకీయ తెర మీదికి తెస్తోంది. ఉత్తరప్రదేశ్ శానససభ ఎన్నికల్లో ఆమె ప్రచారం చేస్తారని యుపి కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులామ్ నబీ ఆజాద్ అధికారికంగా ప్రకటించారు. మరో వైపు, రాజబబ్బర్‌ను కాంగ్రెసు అధ్యక్షుడిగా నియమించారు.

ప్రియాంక గాంధీ మంగళవారం జరిగిన యుపి పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. అంతకు ముందు ప్రియాంక గాంధీ గులాం నబీ ఆజాద్‌తో గంట సేపు సమావేశమయ్యారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి జరిగే శాసనసభ ఎన్నికలపై వారు చర్చించారు.

Priyanka Gandhi to compaign for Congress in UP assembly elections

ఆమె ఇది వరకు రాయబరేలీ, అమెథీ పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం చేశఆరు. రాయబరేలీకి తల్లి సోనియా గాంధీ, అమేథీకి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహంచారు. యుపిలో పార్టీ వ్యూహం గురించి ఆజాద్ కొద్ది రోజులుగా సోనియా గాంధీతోనూ రాహుల్ గాంధీతోనూ చర్చలు జరుపుతూ వచ్చారు.

ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం సాగించాలని ఆజాద్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నిజానికి, ప్రియాంక గాంధీకి యుపి పార్టీ బాధ్యతలు అప్పగించాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Priyanka Gandhi Tuesday met Congress general secretary in-charge of Uttar Pradesh Ghulam Nabi Azad amid speculation about her assuming a bigger role in the party ahead of the 2017 Assembly polls in the state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X