వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంగానదిలో ప్రియాంకా గాంధీ పుణ్యస్నానం..నుదుట తిలకం: పూలు కురిపించిన యోగి సర్కార్

|
Google Oneindia TeluguNews

లక్నో: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆమె.. గంగానదిలో పవిత్ర స్నానాన్ని ఆచరించారు. కుమార్తె మిరియా వాద్రాతో కలిసి ఈ ఉదయం ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్న ఆమె నేరుగా గంగానదీ పవిత్ర సంగమం ఘాట్ల వద్దకు వెళ్లి.. పవిత్ర స్నానం చేశారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా కుడిచేతికి రుద్రాక్షమాలను ధరించి కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వైఎస్ షర్మిలతో జగన్‌ కోటరీ ఎమ్మెల్యే భేటీ: అన్న మాటగా..!వైఎస్ షర్మిలతో జగన్‌ కోటరీ ఎమ్మెల్యే భేటీ: అన్న మాటగా..!

సాదాసీదా భక్తురాలిగా ఆమె ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. ఎలాంటి భద్రత వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. వీఐపీలకు కల్పించే సాధారణ భద్రత కూడా ఆ సమయంలో ఆమె వెంట లేదు. కొందరు పార్టీ ముఖ్య నాయకులు మాత్రమే ప్రియాంకా గాంధీ వెంట ఉన్నారు. మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర సంగమం ప్రదేశంలో పుణ్యస్నానాలను ఆచరించడానికి వందలాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ‌్‌కు చేరుకున్నారు. వారిలో ఓ సాధారణ భక్తురాలిగా ఆమె కనిపించారు.

 Priyanka Gandhi to visits Prayagraj and takes a holy dip in Sangam during the Mauni Amavasya

ప్రియాంకా గాంధీ వస్తున్నారనే సమాచారం తమకు ఉందని, ప్రొటోకాల్‌కు అనుగుణంగా భద్రతను కల్పించడానికి అంగీకరించలేదని ప్రయాగ్‌రాజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ కేపీ సింగ్ తెలిపారు. మౌని అమావాస్య సందర్భంగా భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, ఇలాంటి ప్రత్యేక రోజుల్లో ప్రొటోకాల్‌ను తాము పాటించట్లేదని అన్నారు. పవిత్ర స్నానం ఆచరించిన అనంతరం ప్రియాంకా గాంధీ నేరుగా.. ఆనంద్ భవన్‌ను సందర్శించారు. ఇది.. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, ఆయన కుటుంబీకుల నివాసం. ప్రస్తుతం దీన్ని మ్యూజియంగా మార్చారు.

 Priyanka Gandhi to visits Prayagraj and takes a holy dip in Sangam during the Mauni Amavasya

ఆనంద్ భవన్‌ను సందర్శన సందర్భంగా అక్కడి సిబ్బందితో ముచ్చటించారు. వారి పిల్లలతో సరదాగా గడిపారు. అక్కడ పనిచేసే ఓ మహిళ కుమార్తెను ఒడిలో కూర్చోబెట్టుకుని, వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాతజ్ఙపకాలను గుర్తు చేసుకున్నారు. తాను చదువుకునే సమయంలో స్కూల్ ట్రిప్‌గా ఆనంద్ భవన్‌‌ను సందర్శించడానికి వచ్చే వాళ్లమని ప్రియాంకా గాంధీ చెప్పారు. ప్రియాాంకా గాంధీ.. ప్రయాగ్ రాజ్‌ను సందర్శించిన సమయంలోనే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. హెలికాప్టర్ ద్వారా పూలు కురిపించింది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలను ఆచిరించడానికి వచ్చిన భక్తులకు ఆహ్వానం పలికింది.

 Priyanka Gandhi to visits Prayagraj and takes a holy dip in Sangam during the Mauni Amavasya

English summary
Congress general secretary Priyanka Gandhi Vadra visits Prayagraj and take a holy dip in Sangam during the Mauni Amavasya. She will later visit Anand Bhawan before departing for New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X