వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉన్నావో అత్యాచార బాధితురాలిని చంపేందుకు కుట్ర చేశారు... ప్రియాంక గాంధీ

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో ఘటనలో అత్యాచార బాధితురాలికి సంబంధించిన సిబిఐ విచారణలో పురోగతి లేదని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు. ప్రమాద సంఘటనపై అనుమానాలు ఉన్నాయని ఆమే అన్నారు. మరోవైపు బాధితురాలికి కేటాయించిన గన్‌మెన్‌తో పాటు ఇద్దరు మహిళ పోలీసులు ఎందుకు లేరని ఆమే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీటిపై ప్రభుత్వం స్పందించకపోతే భాదితురాలికి ఎలా న్యాయం జరుగుతుందని ఆమే ఆవేదన వ్యక్తం చేశారు.కాగా అత్యాచారానికి పాల్పడిన ఎమ్మెల్యేను కనీసం సస్పెండ్ కూడ చేయలేదని అన్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో ఘటనలో అత్యాచార బాధితురాలు సహ ఆమే లాయర్ బంధువులు వెళుతున్న కారు ఆదివారం రాత్రి ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఇద్దరు చనిపోగా అత్యచార బాధితురాలితో సహ ఆమే అడ్వకేట్‌కు తీవ్ర గాయలయ్యాయి. దీంతో వారు ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. రాయ్‌బరేలీ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న యువతి బంధువును కలిసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Priyanka Gandhi Vadra has raised questions on cbi probe

అయితే ఈ ప్రమాదం వెనుక కుట్ర జరిగిందని యూపీ ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సైతం పలు అనుమానాలను వ్యక్తం చేశారు. భాదితురాలిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని అన్నారు. ఈ ప్రమాదం వెనక బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ ఉన్నారని ఆరోపణలు చేశారు.

2017 లో ఉద్యోగం కోసం వచ్చిన ఓ యువతిపై భాజపాకు చెందిన ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగర్‌, అతడి అనుచరులు కలిసి అత్యాచారం చేశారని, ఆ యువతి ఆరోపించింది. ఆ తరవాత ఆ యువతి తండ్రి పోలీస్ కస్టడీలో చనిపోవడం యూపీలో చర్చనీయాంశమైంది. అయితే అత్యాచారం జరిగిన తర్వాత తనకు న్యాయం చేయాలంటూ యూపి సీఎం అధిత్య నాధ్ ఇంటి ముందు యువతి ధర్నాకు దిగడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసులో ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగర్‌, అతడి సోదరుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

English summary
congress leader Priyanka Gandhi Vadra has raised questions after the Unnao rape survivor, who had accused a BJP MLA of sexually assaulting her, was involved in a car accident on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X