హింసతో గెలవలేరు.. మోదీ ఇలాకాలో ప్రియాంక.. బనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ

Recommended Video

    Priyanka Gandhi Arrives In Varanasi To Meet BHU Students || Oneindia Telugu

    అహింస పునాదులపై ఏర్పడ్డ దేశంలో హింసను ఒక సాధనంగా వాడేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా పనిచేస్తున్నాయని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఈస్ట్ యూపీ ఇన్ చార్జి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. హింసతో ఎవరూ దేన్నీ గెలవలేరని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సోంత నియోజకవర్గం వారణాసిలో శుక్రవారం పర్యటించిన ఆమె.. తొలిసారి బనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ అయ్యారు.

    వర్సిటీలపై దాడులు..
    ఉదయం ఢిల్లీ నుంచి వారణాసికి విమానంలో వచ్చిన ప్రియాంక.. ఎయిర్ పోర్టు నుంచి బెనారస్ వర్సిటీ వరకు గంగా నదిలో బోటులో ప్రయాణించారు. ప్రియాంకను చూసేందుకు నది ఒడ్డున జనం బారులు తీరారు. వర్సిటీ ఆవరణలో విద్యార్థులతోపాటు వారణాసి సిటీ ప్రముఖులు, స్వచ్ఛంద కార్యకర్తలతోనూ ఆమె మాట్లాడారు. జేఎన్‌యూలో హింసను ప్రస్తావిస్తూ వర్సిటీలపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నదని మండిపడ్డారు.

    Priyanka met BHU students and members of civil society in Varanasi

    బాధితులకు ఓదార్పు..

    Priyanka met BHU students and members of civil society in Varanasi

    పౌరసత్వ సవరణ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను, కేసులు ఎదుర్కొంటున్న బాధితులనూ ప్రియాంక పరామర్శించారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన యాక్టివిస్టు జంట ఏక్తా సింగ్, రవి శేఖర్ లనూ, దళిత ఉద్యమకారుడు అనూప్ శ్రామిక్ తోనూ ప్రియాంక మాట్లాడారు. మధ్యాహ్నానికల్లా పర్యటన ముగించుకుని జైపూర్ వెళ్లిపోయారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+