నాకంతా తెలుసు.. కార్యకర్తలకు ప్రియాంక వార్నింగ్..
రాయ్ బరేలీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ తొలిసారి యూపీలో పర్యటించారు. తల్లి సోనియాతో కలిసి అక్కడికి వెళ్లిన ఆమె.. స్థానిక నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై అసహనంతో ఉన్న ప్రియాంక కార్యకర్తలపై మండిపడ్డారు. వారు పార్టీ గెలుపు కోసం సరిగా పనిచేయనందునే విజయం సాధించలేకపోయామని అన్నారు.
రాయ్ బరేలీ కార్యకర్తలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన ప్రియాంక తాను నిజాలు మాట్లాడతానని, తన మాటలు కఠినంగానే ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో ఏం జరిగిందో తనకు తెలుసన్న ఆమె పార్టీ కోసం పనిచేయని కార్యకర్తలను గుర్తించి చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చింది. ఆమెను పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించి.. తూర్పు యూపీ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రియాంక కాళ్లకు బలపం కట్టుకుని తిరిగారు. పార్టీ అభ్యర్థుల కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారు. అయినప్పటికీ యూపీలో రాయ్ బరేలీ మినహా మరే స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే అమేథీలోనూ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications