Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పౌరసత్వ చట్టం ఎఫెక్ట్, మంగళూరులో పోలీసు కాల్పుల్లో ఇద్దరి మృతి, కర్ఫూ, కేరళ అల్లరిమూకలు ఎంట్రీ !

బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు చేస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతిచ చెందడంతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలైనాయి. కర్ఫూ విధించినా ఆందోళనకారులు రోడ్ల మీదకు చొచ్చుకురావడంతో వారిని నియంత్రించడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపామని కర్ణాటకలోని మంగళూరు నగర పోలీసు కమిషనర్ డాక్టర్ పీఎస్. హర్షా తెలిపారు. పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారని, తీవ్రగాయాలైన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని మంగళూరు నగర పోలీసు కమిషనర్ డాక్టర్ పీఎస్. హర్షా అన్నారు. కేరళ నుంచి అల్లమూకలు మంగళూరులో ప్రవేశించడంతో పరిస్థితి అదుుపుతప్పిందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్ బీఐ సర్కిల్ లో ప్లాన్!

ఎస్ బీఐ సర్కిల్ లో ప్లాన్!

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గురువారం కర్ణాటకలోని అనేక ప్రాంతాలతో సహ మంగళూరు నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మంగళూరులో పరిస్థితి విషమించడంతో పోలీసులు 144 సెక్షన్ జారీ చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కర్ఫూ విధించారు. కర్ఫూ అమలులో ఉన్నా ఆందోళనకారులు ఎస్ బీఐ బ్యాంక్ సర్కిల్ లోకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పోలీసుల వార్నింగ్

పోలీసుల వార్నింగ్

ఆ సమయంలో పోలీసులు హెచ్చరించినా ఆందోళనకారుల మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆసమయంలో పోలీసులు మంగళూరు నగరంలోని బందరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ బీఐ సర్కిల్ లో గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఆరు మందికి తీవ్రగాయాలైనాయి. వెంటనే వారిని మంగళూరు నగరంలోని యూనిటీ ఆసుపత్రికి తరలించారు.

మతఘర్షణల భయం?

మతఘర్షణల భయం?

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మంగళూరు నగరంలో ఆందోళనలు ఎక్కువ కావడంతో ఎక్కడ మత ఘర్షణలు జరుగుతాయో అనే అనుమానంతో బుధవారం రాత్రి నుంచి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అయితే ఆందోళనకారులకు, పోలీసుల మద్య వాగ్వివాదం జరిగింది. ఆందోళనకారులను అదుపు చెయ్యడానికి పోలీసులు కాల్పులు జరపడంతో పరిస్థితి విషమించింది.

ఇద్దరు బలి

ఇద్దరు బలి

పోలీసులు జరిపిన కాల్పుల్లో మంగళూరులోని బెంగ్రే నివాసం నౌశిన్ (23), కందక నివాసి జలీల్ (49) అనే ఇద్దరు మరణించారు. కేరళ నుంచి అల్లరిమూకలు మంగళూరులో ప్రవేశించి స్థానికులను రెచ్చగొట్టి గొడవలకు కారణం అయ్యారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 కర్ఫూ, కనిపిస్తే కాల్చివేత!

కర్ఫూ, కనిపిస్తే కాల్చివేత!

పోలీసు కాల్పుల్లో ఇద్దరు మరణించడంతో మంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా మంగళూరులో శుక్రవారం అర్దరాత్రి వరకు కర్పూ జారీ చేశారు. ఎక్కడైన రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చెయ్యడానికి ప్రయత్నిస్తే పరిస్థితులు విషమంగా ఉంటాయని పోలీసు అధికారులు హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యగా అదనపు పోలీసు బలగాలను మంగళూరుకు తరలించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+