ఉద్రిక్తంగా జాట్ల ఆందోళన: పోలీసులపైకి రాళ్ళు రువ్విన ఆందోళనకారులు, లాఠీచార్జీ

Posted By:
Subscribe to Oneindia Telugu

ఫతేబాద్::రిజర్వేషన్లు కల్పించాలంటూ జాట్లు చేస్తోన్న ఆందోళన ఆదివారం నాడు ఉద్రిక్తంగా మారింది. పార్లమెంట్ ముట్టడికి వెళ్తున్న ఆందోళనకారులకు పోలీసులకు మద్య గొడవ చోటుచేసుకొంది. పోలీసులపైకి ఆందోళన కారులు రాళ్ళు రువ్వారు.పోలీసులు ఆందోళన కారులపై లాఠీ చార్జీ చేశారు.

రిజర్వేషన్లు కల్పించాలంటూ జాట్లు సోమవారం నాడు పార్లమెంట్ ను ముట్టడించేందుకుగాను వావాహనాల్లో డిల్లీకి బయలు దేరారు.అయితే సిర్సా హిస్సార్ డిల్లీ జాతీయ రహదారి ద్వారా డిల్లీలోకి ప్రవేశించేందుకు వస్తోన్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొన్నారు.

Protesters clash with cops on Sirsa-Hisar Delhi National Highway

దీంతో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్ళురువ్వారు. పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.ఈ ఘటనలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. డిఎస్ పి గుర్డియల్ సింగ్ తో పాటు మరో ముగ్గురు పోలిసులు ఆందోళన కారులు గాయపడ్డారు.

ఈ ఆందోళనకు సంబందించిన వార్తలను కవర్ చేస్తోన్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల దగ్గర నుండి కెమెరాలను లాక్కొన్నారని పోలీసులు చెప్పారు. రెండు బస్సులను ద్వంసమైనట్టు పోలీసులు చెప్పారు.

శాంతియుతంగా ఆందోళన చేసేందుకు వెళ్తొంటే పోలీసులు అడ్డుకొంటున్నారని జాట్ నేతలు చెబుతున్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హర్యానా మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. 15 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Deputy Superintendent of Police and three other policemen were left injured after several Jat protesters clashed with police during their march towards Delhi here today, a police official claimed.
Please Wait while comments are loading...