గవర్నర్ బర్త్ డే: గొర్రెలతో నిరసన -నారద ఎఫెక్ట్ -బెంగాల్ సీఎం మమతపై ఫైర్ -మోదీకి దీదీ ఘాటు లేఖ
ఎన్నికలు ముగిసి, టీఎంసీ బంపర్ మెజార్టీతో గెలిచి, మమతా బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రం వర్సెస్ కేంద్రం వివాదం కొనసాగుతూనే ఉన్నది. ఏడేళ్ల కిందటి శారద చిట్ ఫండ్ స్కామ్ ను మళ్లీ బయటికి తీసిన కేంద్రం.. సీబీఐ ద్వారా టీఎంసీ కీలక మంత్రులు, ఎమ్మెల్యేలను అరెస్టు చేయించడం, అదే కుంభకోణంతో ప్రమేయమున్న నాటి టీఎంసీ, ప్రస్తుత బీజేపీ నేతలు సేవేందు అధికారి, ముకుల్ రాయ్ లకు సీబీఐ మినహాయింపు ఇవ్వడం వివాదాస్పదమైంది. బెంగాల్ కొవిడ్ విలయ నిర్వహణలో గవర్నర్ విఫలం చెందారనే ఆరోపణలూ వెల్లువెత్తాయి. ఈ క్రమంలో..
కోల్ కతాలోని రాజ్ భవన్ వద్ద గొర్రెలతో నిరసన ప్రదర్శనలపై గవర్నర్ జగదీప్ ధనకర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 144 అమలయ్యే రాజ్ భవన్ గేటు వద్ద సంఘవిద్రోహశక్తులకు అవకాశంకల్పించింది మీరేనంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కోల్ కతా పోలీసులపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెంగాల్ గవర్నర్ నివాసం వద్ద మంగళవారం అనూహ్య దృశ్యాలు చోటుచేసుకున్నాయి. నారద కుంభకోణంలో కేంద్రం తీరును నిరసిస్తూ టీఎంసీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయగా, కొవిడ్ నిర్వహనలో గవర్నర్ ఫెయిలయ్యారంటూ 'కోల్ కతా నాగరిక్ మంచ్' అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన నిరసనకారులు గోర్రెలతో రాజ్ భవన్ ను ముట్టడించారు. సరిగ్గా తన పుట్టినరోజునాడే రాజ్ భవన్ వద్ద ఇలాంటి సంఘటనలు జరగడంపై గవర్నర్ ధనకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను నిందిస్తూ, పోలీసులను వివరణ కోరుతూ గవర్నర్ బాహాటంగా ట్వీట్లు చేశారు. ఇదిలా ఉంటే,

బెంగాల్ లో సుపరిపాలన సాగాలంటే ప్రస్తుత గవర్నర్ జగదీప్ ధనకర్ ను తక్షణమే మార్చేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్, ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె లేఖ రాశారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ సర్కారుకు వ్యతిరేకంగా అసాధారణమైన రీతిలో గవర్నర్ దాడికి పాల్పడుతున్నారని, మాటిమాటికీ సీఎం మమతను బెదిరిస్తున్నారని, పదే పదే శాంతి, భద్రతల సమస్యను లేవనెత్తడం, పబ్లిక్ డొమైన్‌లో ట్వీట్ చేయడం ద్వారా గవర్నర్ తన పరిధుల్ని దాటుతున్నారని రాష్ట్రపతి, ప్రధానికి రాసిన రాసిన లేఖలో మమత ఆరోపణు చేశారు. గవర్నర్‌ను తొలగించాలని కోరుతూ బెంగాల్ అసెంబ్లీలో తీర్మానాన్ని చేసే విషయమై టీఎంసీ సీరియస్ గా ఆలోచిస్తున్నది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications