15 ఏళ్లలో 6 లక్షల కొలువులు.. ఆర్జేడీ ఇచ్చింది 95 వేలే.. నితీశ్ నిప్పులు

బీహర్ రెండు, మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఓటర్లను ఆకట్టుకునే పడ్డారు నేతలు. ప్రధానంగా యువత ఓటు బ్యాంకును క్యాష్ చేసుకోవాలని భావిస్తోన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు అని తేజస్వీ యాదవ్ చెబుతుండగా.. 19 లక్షల ఉద్యోగాలు అని బీజేపీ ప్రచారం చేస్తోంది. అయితే ఉద్యోగాల గురించి పెదవి విప్పని.. సీఎం నితీశ్ కుమార్ తొలిసారి స్పందించారు. తిరిగి అధికారం చేపడితే కాదు.. గత 15 ఏళ్లలో ఇచ్చిన కొలువుల లెక్క చెప్పారు. దీంతో ఉద్యోగాల చుట్టూ బీహర్ ప్రచార పర్వం కొనసాగుతోంది.

గత 15 ఏళ్లలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని నితీశ్ కుమార్ తెలిపారు. కానీ ఆర్జేడీ 15 ఏళ్లలో ఇచ్చింది 95 వేల కొలువులు అని స్పష్టంచేశారు. వారి కన్నా ఆరు రెట్లు ఎక్కువగా ఇచ్చామని వివరించారు. చాలా మందికి పరోక్షంగా ఉపాధి కూడా కల్పించామని తెలిపారు. తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో సౌర విద్యుత్‌‌తో వీధి దీపాలను వెలిగిస్తామని ఆయన హామీనిచ్చారు. దీంతో గ్రామాలు విద్యుత్ కాంతులతో ఉంటాయని పేర్కొన్నారు.

Provided 6 lakh jobs during 15 years in office: Nitish Kumar

బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం కూటమి.. ఆర్జేడీ, బీజేపీ ఇతర పక్షాలు కలిసి పోటీనిస్తున్నాయి. ఎల్జేపీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగింది. ఈ నెల 28వ తేదీన తొలి విడత 71 స్థానాలకు పోలింగ్ జరిగింది. నవంబర్ 3వ తేదీన రెండో విడత పోలింగ్.. 7వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోనుంది.

Recommended Video

    Bihar Election Phase 1 : Difficulties Faced By Older People Due To EVM's Technical Problems

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+