సైకో కలకలం: నగ్నంగా మహిళల హాస్టల్లో దూరి, లోదుస్తులతో అసభ్యంగా(వీడియో)

Subscribe to Oneindia Telugu

సైకో కలకలం: నగ్నంగా మహిళల హాస్టల్లో దూరి, లోదుస్తులతో అసభ్యంగా(వీడియో)

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ సైకోను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహిళా కళాశాల హాస్టల్లోకి నగ్నంగా ప్రవేశించి బయట ఆరేసిన విద్యార్థినుల లోదుస్తుల్ని ధరించి అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Psycho-minded' Bengaluru man sneaks into women's hostel, steals lingerie, is captured on CCTV

వివరాల్లోకి వెళితే.. పారిశుద్ధ్య పనులు చేసే అబుతాలిమ్‌ (35).. ఫిబ్రవరి 12 అర్ధరాత్రి నగరంలోని ఓ మహిళా కళాశాలలోకి ప్రవేశించి విద్యార్థినుల లోదుస్తులు ధరించి విచిత్రంగా ప్రవర్తించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

దీనిపై హాస్టల్‌ మేట్రన్‌ హైగ్రౌండ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి 4న అర్ధరాత్రి నిందితుడు మళ్లీ విద్యార్థినుల వసతిగృహంలోకి ప్రవేశించగా కాపలాదారులు పట్టుకున్నారు. అయినా పోలీసులు వచ్చేలోగా తప్పించుకుని పరారయ్యాడు. దీంతో పోలీసులు రాత్రిళ్లు వసతి గృహం వద్ద కాపుకాసి.. మంగళవారం పట్టుకున్నారు.

అబుతాలిమ్‌ బిహార్‌కు చెందినవాడని, అతడి భార్య, ఇద్దరు పిల్లలు అక్కడే ఉంటున్నారని పోలీసులు తెలిపారు. నిందితుడి వల్ల ఏ విద్యార్థినికీ ఎలాంటి సమస్య ఎదురుకాలేదని చెప్పారు. ప్రస్తుతం అతనికి మానసిక చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. హాస్టల్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్లే నిందితుడిని గుర్తించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bengaluru, a city still reeling from the mass molestation on New Year’s Eve, was witness to a bizarre yet dangerous incident when a knife-wielding semi-nude youth was caught on camera, sneaking into the ladies hostel of the Maharani's Arts, Commerce and Management College for Women.
Please Wait while comments are loading...