బుల్లెట్ గాయం: శిరీష ఆసుపత్రి ఖర్చు ప్రభుత్వానిది
బెంగళూరు: కాడుగోడిలోని ప్రగతి కాలేజ్ లో పీయుసీ విద్యాభ్యాసం చేస్తూ అటెండర్ మహేష్ జరిపిన కాల్పులలో గాయపడిన శిరీష చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ పి హరిశేఖరన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
మహేష్ కాల్పులు జరపడంతో గౌతమి మరణించిందని, మరో బుల్లెట్ దూసుకు వెళ్లి శిరిషా ముక్కు తదితర చోట్ల గాయాలయ్యాయని చెప్పారు. ఇప్పటికే ఆమెకు శస్త్రచికిత్స చేశారని, ఆరోగ్యం కుదుట పడుతున్నదని హరిశేఖరన్ తెలిపారు. శిరిషా త్వరలోనే సంపూర్ణంగా కోలుకుంటుందని వైద్యులు చెప్పారని హరిశేఖరన్ వివరించారు.

శిరీషను పరామర్శించిన మంత్రి ఉమాశ్రీ
బుల్లెట్ దూసుకు వెళ్లి గాయాలై మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిరీషను కర్ణాటక మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ పరామర్శించారు. శుక్రవారం ఆసుపత్రిలో శిరీషను పరామర్శించిన మంత్రి, ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
పేలని తుపాకి-తప్పించుకున్న గాయిత్రి
పీయుసీ విద్యార్థిని గాయిత్రీ ప్రగతి కాలేజ్ హాస్టల్ లో ఉంటున్నది. గౌతమి, శిరీషల మీద తుపాకితో కాల్పులు జరిన మహేష్ బయటకు వచ్చాడు. ఆ సమయంలో గాయిత్రీ ఎదురు పడింది. అతనిని గాయత్రి ప్రశ్నించింది. ఆ సమయంలో మహేష్ గాయిత్రీ మీద కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు.
పిస్తోల్ పేలకపోవడంతో గాయిత్రీ అక్కడి నుండి పరుగు తీసింది. గౌతమి హత్యకు గురి కావడంతో ప్రతిభ కాలేజ్ లేడిస్ హాస్టల్ ఉంటున్న 77 మంది విద్యార్థినిలు హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. విద్యార్థినీల కుటుంబ సభ్యులు వారి పిల్లలను తీసుకు వెళ్లారు. ఏబీవీపీ కార్యకర్తలు ప్రతిభా కాలేజ్ బోర్డుకు నిప్పంటించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications