తాజా మాజీ సీఎంకు భారీ షాక్ -పుదుచ్చేరి అసెంబ్లీ కాంగ్రెస్ జాబితాలో నారాయణస్వామికి మొండిచెయ్యి
అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికలు కోలాహలంగా సాగుతున్నాయి. అన్నాడీఏంకేతో కలిసి బీజేపీ కొత్త ఎత్తులు వేస్తుండగా, అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గతంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజా మాసీ సీఎం వి. నారాయణస్వామిని ఏకంగా ఎన్నికల బరి నుంచి పక్కకు తప్పించింది.
పుదుచ్చేరిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు గానూ కాంగ్రెస్ పార్టీ మొత్తం 14 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. అందులో తాజా మాజీ సీఎం నారాయణస్వామి పేరు లేదు. దీంతో కార్యకర్తలు, ఆయన వర్గీయులు ఆందోళనకు గురయ్యారు. చావు కబురు చల్లగా తరహాలో కాస్త ఆలస్యంగా దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ వివరణ ఇచ్చింది.
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం నారాయణస్వామి బరిలోకి దిగడం లేదని, అందుకే అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు కనిపించలేదని పుదుచ్చేరి ఏఐఐసీ ఇన్‌చార్జి దినేష్ గుండురావు మీడియాకు తెలిపారు. అయితే, ప్రచార బాధ్యతల నుంచి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ నారాయణస్వామే దగ్గరుండి చూసుకుంటారని గుండూరావు క్లారిటీ ఇచ్చారు. ఈసారి..

మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్ 6న పోలింగ్ జరుగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి కొద్దిరోజుల ముందు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఓ డీఎంకే(మిత్రపక్షం) ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో నారాయణస్వామి ప్రభుత్వం కూలిపోయింది.
ప్రస్తుతం అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రులైన డీఎంకే 13 చోట్ల, సీపీఐ 1, వీసీకే 1 స్థానంలో బరిలోకి దిగాయి. కాంగ్రెస్ కోటాలోని మరో సీటుకు అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications