ఎన్ఎస్ జీ అదుపులో ఐదుగురు ఉగ్ర దాడి నిందితులు ..?
శ్రీనగర్ : పుల్వామాలో మాటు వేసి సీఆర్పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టిన ఉగ్ర దాడి కేసు దర్యాప్తు స్పీడందుకొంది. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారిస్తోండగా .. సీన్ ఆఫ్ కన్ స్ట్రక్షన్ కోసం ఎన్ఎస్ జీ, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఉగ్రమూకలపై ఉక్కుపాదం మోపుతామని .. ప్రతి దాడులు తప్పవని ప్రధాని మోదీ హెచ్చరించారు.
ఎన్ఎస్జీ సహకారం ..
పుల్వామా దాడితో ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది .. దాడి సూత్రదారుల ఎవరనే పనిలో నిమగ్నమైంది. దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ ప్రకటించిన .. ఐఎస్ఐ హస్తం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఉగ్ర దాడి ఘటనను విచారిస్తున్న ఎన్ఐఏ .. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) కమాండోలు సహకారం అందిస్తున్నారు. గురువారం దాడి జరగడంతో సంఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించారు. కాన్వాయ్ వెళ్లే తీరు .. ఉగ్రవాదుల కారు వచ్చి ఢీ కొట్టిన పరిణామ క్రమాన్ని సీన్ ఆఫ్ కన్ స్ట్రక్షన్ చేశారు. కారులో ఐఈడీ పేలుడు బాంబులు తీసుకొచ్చిన మానవ మ్రుగం ఆదిల్ అహ్మద్ ఘటనాస్థలంలో చనిపోగా .. ఈ దాడి కుట్రలో ఎవరెవరి హస్తం ఉన్నదనే కోణంలో విచారణ జరుగుతోంది.

అదుపులో ఐదుగురు నిందితులు
ఉగ్రదాడితో సంబంధం ఉన్న ఐదుగురిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి పుల్వామా జిల్లాలో దాడి జరిగిన అవంతిపుర సమీప గ్రామాలను జల్లెడపట్టారు. పలు గ్రామాల్లో అన్వేషించి రెండు గ్రామాల నుంచి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి సంబంధించి వారిని విచారిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications