వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ కుట్రపై తిరుగులేని ఆధారాలు - పుల్వామా ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ 13,500 పేజీల చార్జిషీట్

|
Google Oneindia TeluguNews

ఉగ్రవాదుల కార్ఖానాగా పేరు పొందిన పాకిస్తాన్.. ఇండియాలో ధ్వంసరచనకు పాల్పడిందనేందుకు తిరుగులేని ఆధారాలు లభించాయి. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన పుల్వామా ఉగ్రదాడి ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం చార్జిషీటును ఫైల్ చేసింది. జమ్మూలోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టుకు మొత్తం 13,500 పేజీలతో కూడిన చార్జిషీటును దాఖలు చేశామని, అందులో కేసుకు సంబంధించిన టెక్నికల్, మెటీరియల్, సందర్భోచిత ఆధారాలను పొందు పర్చామని అధికారులు తెలిపారు.

షాకింగ్: మహిళా ఎస్సైపై అత్యాచారం - తోటి ఎస్సై ఘాతుకం - సెటిల్మెంట్ - కులం తక్కువని రివర్స్షాకింగ్: మహిళా ఎస్సైపై అత్యాచారం - తోటి ఎస్సై ఘాతుకం - సెటిల్మెంట్ - కులం తక్కువని రివర్స్

మాస్టర్ మైండ్ మసూద్

మాస్టర్ మైండ్ మసూద్

గతేడాది ఫిబ్రవరి 14న జమ్మూ-శ్రీనగర్ హైవేపై సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జరిగిన దాడిలో మొత్తం 40 మంది జవాన్లను చనిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఏడాదిన్నరగా దర్యాప్తు చేస్తోన్న ఎన్ఐఏ ఎట్టకేలకు చార్జిషీటు వేసింది. అందులో పలు సంచలన విషయాలు పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడికి పాకిస్తాన్ గడ్డపై నుంచే ప్లానింగ్, ఆదేశాలు వెలువడ్డాయని ఎన్ఐఏ తెలిపింది. ఈ కేసులో మొత్తం 19 మంది నిందితులుండగా, అందులో ఏడుగురు పాకిస్తాన్ జాతీయులే కావడం గమనార్హం. జైష్ ఏ మొహ్మద్ చీఫ్ మసూద్ అజార్, అతని సోదరుడు రవూఫ్ అస్గర్ పేర్లను ప్రధాన కుట్రదారులుగా పేర్కొన్నారు.

ఆజాద్ కాశ్మీర్ సాకుతో..

ఆజాద్ కాశ్మీర్ సాకుతో..

పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే సూసైడ్ బాంబర్ ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ కారులో పేలుడు పదార్థలను నింపుకొని, సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డాడు. కాశ్మీర్ విముక్తి పేరుతో జైషే సాగిస్తోన్న ఉగ్రవాదానికి ఆకర్షితులై ఆదిల్ తోపాటు జమ్మూకాశ్మీర్ కు చెందిన పలువురు ఈ దాడులో పాలుపంచుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద భారత ప్రభుత్వం మసూద్ అజార్ ను టెర్రరిస్టుగా గుర్తించిన సంగతి తెలిసిందే.

పుల్వామా దాడి నిందితుల జాబితా..

పుల్వామా దాడి నిందితుల జాబితా..

పుల్వామా ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో నిందితుల వివరాలిలా ఉన్నాయి. 1.మసూద్ అజార్(52 ఏళ్లు, పాకిస్తానీ), 2.రవూఫ్ అస్గర్ ఆల్వీ(46, పాకిస్తానీ), 3.అమ్మర్ ఆల్వీ(46, పాకిస్తానీ), 4.షకీర్ బషీర్(24 ఏళ్లు, పుల్వామా నివాసి), 5.ఇషా జాన్(22ఏళ్ల ఏకైక మహిళ, కొకాపొరా నివాసి), 6.పీర్ తారీఖ్ అహ్మద్ షా(53, కొకాపొరా), 7.వయీజ్ ఉల్ ఇస్లామ్(20, శ్రీనగర్), 8.మొహ్మద్ అబ్బాస్ రతేర్(31, కొకాపొరా), 9.బిలాల్ అహ్మద్ కుచే(28,లాల్‌హర్ వాసి), 10.మొహ్మద్ ఇక్బాల్ రతేర్(25, బుద్గాం), 11.మొహ్మద్ ఇస్మాయిల్25, పాకిస్తానీ), 12.సమీర్ అహ్మద్ దార్(22, కొకాపొరా), 13.అషాక్ అహ్మద్ నెంగ్రూ(33, రాజౌరీ),

ఇప్పటికే ఆరుగురు ఖతం..

ఇప్పటికే ఆరుగురు ఖతం..

సూసైడ్ బాంబర్ ఆదిల్ సహా ఈ కేసులో పలువురు నిందితులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఆ నిందుల జాబితా ఇది. 14.ఆదిల్ అహ్మద్ దార్(21, కొకాపొరా), 15.మహ్మద్ ఉమర్ ఫారూఖ్(24, పాకిస్తాన్), 16.మొహ్మద్ కమ్రాన్ అలి(25, పాకిస్తానీ), 17.సజ్జాద్ అహ్మద్ భట్(19, అనంత్‌నాగ్), 18.ముదాసిర్ అహ్మద్ ఖాన్(24, అవంతిపొరా), 19.ఖరీ యాసిర్(పాకిస్తాన్ జాతీయుడు).

ఆజాద్.. 45 ఏళ్ల గులాంగిరీకి ఇదా బహుమానం? ముస్లిం కాబట్టేగా - అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలుఆజాద్.. 45 ఏళ్ల గులాంగిరీకి ఇదా బహుమానం? ముస్లిం కాబట్టేగా - అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

English summary
The National Investigation Agency (NIA) on Tuesday filed a charge sheet in the February 2019 Pulwama terror attack case in which it named 19 people who it said carried out the bombing at Pakistan’s behest. The 13,500-page charge sheet was filed before a special NIA court in Jammu. names Jaish chief Masood Azhar, his brothers and Pakistan among 19 accused people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X