వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీ అంటే కామెడీ అయిపోయిందా .. రాహుల్ స్థానం ఇవ్వండి..!! ఎలక్ట్రికల్ ఇంజనీర్ రిక్వెస్ట్.

|
Google Oneindia TeluguNews

ముంబై : రాహుల్ గాంధీ రాజీనామాతో కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని ఎవరు చేపడతారన్న అంశంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. అధ్యక్షపగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పలువురు పార్టీ సీనియర్లు పరోక్షంగా సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. అయినా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ప్రెసిడెంట్ అయ్యే వ్యక్తి గాంధీ కుటుంబీకులే కావాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆ మాటలే స్ఫూర్తిగా పూనేకు చెందిన ఓ ఇంజనీర్ తెరపైకి వచ్చాడు. పార్టీ పగ్గాలు తనకు అప్పజెపితే కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెస్తానని అంటున్నాడు. ఇంతకీ ఎవరా ఇంజనీర్? ఏమిటా కథ?

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్

గజానంద్ హోసలే. వయసు 28ఏళ్లు. ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈయన ప్రస్తుతం పూనేలోని ఓ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. రాజకీయాలంటే తనకు ఎంతో ఆసక్తి అంటున్న ఆయన.. కాంగ్రెస్ బాధ్యతల్ని తనకు అప్పజెపితే పార్టీకి పునర్వైభవం తెస్తానని అంటున్నారు. ఇందుకోసం ఈ నెల 23న పూనే కాంగ్రెస్ యూనిట్ ప్రెసిడెంట్ను కలిసి అప్లికేషన్ ఇస్తానని చెబుతున్నాడు. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినా పార్టీ సీనియర్లు కొత్త ప్రెసిడెంట్ ఎంపికలో అయోమయానికి లోనవుతున్నారని గజానంద్ అంటున్నాడు. అందుకే ఈ సమస్య పరిష్కారం కోసం తాను నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు చెప్పాడు.

నాయకుడు లేనందునే కార్యకర్తలు దూరం

నాయకుడు లేనందునే కార్యకర్తలు దూరం

కాంగ్రెస్‌కు పునర్‌వైభవం దేశ తక్షణ అవసరమన్న గజానంద్ అందుకోసం యువ నాయకత్వం అవసరమని అంటున్నాడు. రాహుల్ గాంధీ కూడా ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేస్తున్నాడు. పార్టీ బాధ్యతలు చేపట్టే వ్యక్తి కేవలం వయసులో యువకుడై ఉండటమే కాదు.. తనలాగే వారి మనసు, ఆలోచనలు కూడా యవ్వనంగా ఉండాలని చెబుతున్నాడు. కాంగ్రెస్‌కు సారథి లేనందునే పలువురు కార్యకర్తలు పార్టీకి దూరమవుతున్నారని, అదే కాంగ్రెస్‌ వైఫల్యాలకు కారణమన్నది గజానంద్ అభిప్రాయం.

పార్టీ సభ్యత్వం కూడా లేని గజానంద్

పార్టీ సభ్యత్వం కూడా లేని గజానంద్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన రాజకీయ అనుభవం ఉందా అన్న ప్రశ్నకు గజానంద్ ఆసక్తికర సమాధానం చెబుతున్నారు. తనకు రాజకీయ అనుభవం లేదని, అయితే గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన తాను వివిధ అంశాల్లో అధికారులను ఎలా ఒప్పించాలన్న నేర్పు ఉందని అంటున్నాడు. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న గజానంద్‌కు ఇంతకీ పార్టీ సభ్యత్వం కూడా లేకపోవడం గమనార్హం. అయితే తాను నామినేషన్ దాఖలు చేసేలోపు పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోవడంతో పాటు ఇతర ప్రక్రియలన్నీ పూర్తి చేస్తానని అంటున్నాడు.

పూర్వవైభవానికి బ్లూప్రింట్‌‌తో రెడీ

పూర్వవైభవానికి బ్లూప్రింట్‌‌తో రెడీ

కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవే ఎందుకు పార్టీ కార్యకర్తగా పనిచేయవచ్చు కదా అన్న ప్రశ్నకు గజానంద్‌ ఊహించని జవాబు చెబుతున్నాడు. కార్యకర్తగా పనిచేస్తే తన ప్రతిభను చూసి పక్కనపెట్టే ఛాన్సుందని అందుకే అధ్యక్ష పగ్గాలు చేపట్టాలనుకుంటున్నానని అంటున్నాడు. పారదర్శకతకు పెద్ద పీట వేసి కాంగ్రెస్‌ను గాడిలో పెడతానంటున్న ఈ ఇంజనీర్.. ప్రస్తుత సంక్షోభం నుంచి పార్టీని గట్టెక్కించేందుకు ఇప్పటికే బ్లూ ప్లింట్ రెడీ చేసినట్లు చెబుతుడటం విశేషం.

English summary
A 28-year-old electronics engineer from Pune has expressed his desire to apply for the post of congress president.Gajanand Hosale, who works as a manager in a Bengaluru head-quartered manufacturing firm in Pune, is planning to submit his application form to the city unit president of Congress, Ramesh Bagwe, on July 23.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X