హఠాత్తుగా కుప్పకూలిన భారీ హోర్డింగ్: నలుగురు మృతి(వీడియో)
పుణె: మహారాష్ట్రలోని పుణె రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా 40 అడుగుల భారీ హోర్డింగ్ కుప్పకూలడంతో నలుగురు వ్యక్తులు మరణించారు.
మృతుల్లో తన భార్య చితాభస్మాన్ని నదిలో కలిపి వస్తున్న శివాజీ పరదేశి(40) అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

హోర్డింగ్ మీదపడటంతో ఐదు ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కారు ధ్వంసమయ్యాయి. పలుమార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ రైల్వే కాంట్రాక్టర్ స్పందించలేదని, ఆయనపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.
#Pune illegal #hording took life of 3 common people.
— Pratik Chordiya (@ChordiyaPratik) October 6, 2018
Who is responsible for this insident.#Municipal #corporation or #police ???@ANI @PTI_News @aajtak @BJP4India @AamAadmiParty @INCIndia @PuneCityPolice #illegalhordings #Maharashtra #pune #bjp #congress #ncp @PrakashJavdekar pic.twitter.com/kfgxjaNZLH
కాగా,ఘటనపై రైల్వే శాఖ కూడా ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications