గోల్డ్‌మన్‌ను చంపింది కొడుకు మిత్రులే: పక్కా ప్లాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

పూణే: మహారాష్ట్రంలోని పూణే గోల్డ్‌మన్ దత్తాత్రేయ ఫుగేను హత్య చేసింది ఆయన కుమారుడి మిత్రులేనని తేలింది. ఈ హత్య కేసులో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ. 1.5లక్షల కోసం దత్తాత్రేయ కుమారుడు శుభమ్‌ స్నేహితులే అతడిని చంపినట్లు పోలీసులు తెలిపారు.

దత్తాత్రేయ పుగె గురువారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పుగేను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. శుభమ్‌ స్నేహితుడు అతుల్‌ మోహిత్‌ గురువారం రాత్రి అతడికి ఫోన్‌ చేసి ఓ మిత్రుడి పుట్టినరోజు పార్టీకి రావాల్సిందిగా కోరాడు.

Also See: బంగారు చొక్కా, ఒళ్లంతా పసిడి: గోల్డ్‌మన్‌ను చంపేశారు

తనతో పాటు తండ్రిని కూడా పార్టీకి తీసుకురావాలని అతను శుభమ్‌కు చెప్పాడు. వస్తూ వస్తూ బిర్యానీ, సిగరెట్‌ ప్యాకెట్లు తీసుకురావాలని కూడా చెప్పాడు. దీంతో నేరుగా పార్టీకి వెళ్లాలని తండ్రి దత్తాత్రేయకు శుభమ్ చెప్పాడు. శుభమ్‌ తన స్నేహితుడు రోహన్‌ పంచాల్‌తో కలిసి ఆహారం తీసుకొచ్చేందుకు మరో కారులో వెళ్లాడు.

Pune 'Gold Man' Was Killed By Son's Friends Over Rs. 1.5 Lakh, Say Police

దత్తాత్రేయ పార్టీకి వెళ్లాడు. అయితే శుభమ్‌, అతడి స్నేహితుడు ఆహారం తీసుకుని వచ్చేసరికే మోహిత్‌, మరికొందరు దత్తాత్రేయపై కత్తితో తీవ్రంగా దాడిచేస్తూ కనిపించారు. కత్తివంటి పదునైన ఆయుధాలతో దాడి చేయడం చూశారు. వెంటనే శుభమ్‌ పోలీసులకు ఫోన్‌ చేశాడు.

అదే సమయంలో నగరపాలక సంస్థ మాజీ కార్పోరేటర్ అయిన దత్తాత్రేయ భార్య సీమా కూడా అక్కడికి చేరుకున్నారు. దాంతో మోహిత్‌, అతడి స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన దత్తాత్రేయ అక్కడికక్కడే మరణించాడు. వాస్తవానికి దత్తాత్రేయ బాడీగార్డులు లేకుండా ఎక్కడికీ వెళ్లరు. కానీ ఆ రోజు వారెందుకు లేరనేది అర్థం కావడం లేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Investigators said Pune's multi-millionaire Datta Phuge was killed by his son's friends to recover Rs. 1.5 lakh he owed them.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి