10 రోజులు లాక్ డౌన్: పాలు, మందులకే అనుమతి, కరోనా కేసులు పెరగడంతో కీలక నిర్ణయం
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి యూపీలో లాక్ డౌన్ అమలైన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. అయితే కరోనా పాజిటివ్ కేసులు పుణేలో పెరగడంతో సోమవారం ఈ నెల 13వ తేదీ నుంచి పది రోజులపాటు లాక్ డౌన్ విధించారు.
Recommended Video

పుణెతోపాటు సమీపంలో గల పింప్రీ, చించ్ వాడ్, ఇతర ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తామని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కేసులు జిల్లాలో పెరుగుతూనే ఉన్నాయి. ఒకరోజుల 1803 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34 వేల 399కి చేరింది. మృతుల సంఖ్య 978గా ఉంది.
శుక్రవారం జిల్లా ఇంచార్జీ మంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ అధికారులతో సమీక్షించి లాక్ డౌన్ నిర్ణయాన్ని వెల్లడించారు. లాక్ డౌన్ సమయంలో కేవలం పాలు, మందులు మాత్రమే తెరుచుకుంటాయని అధికారులు స్పష్టంచేశారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు 10 రోజుల లాక్ డౌన్ అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications