వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ కార్యకర్తను పెళ్లాడిన మహిళా ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరీందర్ కౌర్ భరాజ్ వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. పార్టీ కార్యకర్త మణ్‌దీప్ సింగ్‌తో కలిసి ఆమె దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. భవానీగఢ్ ప్రాంతంలోని లాఖేవాల్ గ్రామానికి చెందిన మణ్ దీప్‌ను ఆమె వివాహమాడారు. ఆయన గతంలో సంగ్రూర్ జిల్లా ఆప్ మీడియా ఇంఛార్జీగా పనిచేశారు.

ఘనంగా నరీందర్-మణ్‌దీప్‌ల వివాహం

ఘనంగా నరీందర్-మణ్‌దీప్‌ల వివాహం

ఈ సమయంలో ఏర్పడిన పరిచయమే వివాహ బంధానికి దారితీసినట్లు తెలుస్తోంది. పటియాలలోని రోరేవాల్ గ్రామంలోని ఓ గురుద్వారాలో జరిగిన నరీందర్ కౌర్-మణ్‌దీప్ వివాహానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సతీమణి గుర్ ప్రీత్ కౌర్ సహా రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు.

రైతు కుటుంబం నుంచి వచ్చి ఎమ్మెల్యేగా నరీందర్ కౌర్ భరాజ్

రైతు కుటుంబం నుంచి వచ్చి ఎమ్మెల్యేగా నరీందర్ కౌర్ భరాజ్

28 ఏళ్ల నరీందర్ కౌర్ సంగ్రూర్‌లోని భరాజ్ గ్రామంలోని సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. పటియాలాలోని పంజాబ్ యూన్సివర్సిటీలో ఆమె ఎల్ఎల్‌బీ చదివారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో నరీందర్ కౌర్ తన గ్రామంలో ఒంటరిగా ఆమ్ ఆద్మీ పార్టీ బూత్ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. నేటి సీఎం భగవంత్ మాన్ ప్రోత్సాహంతో రాజకీయాల్లో మరింత చురుకుగా పనిచేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్గజ నేతను ఓడించిన నరీందర్ కౌర్

అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్గజ నేతను ఓడించిన నరీందర్ కౌర్

కాగా, ఈ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంగ్రూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు నరీందర్ కౌర్ భరాజ్. కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లాను 36,430 ఓట్లతో ఆమె ఓడించారు.
అంతేగాక, పంజాబ్ రాష్ట్రంలో నరీందర్ కౌర్ అత్యంత యువ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు.

English summary
Punjab AAP MLA Bharaj ties knot with party volunteer in Patiala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X