మత మార్పిడిలు ఏంటీ..? జగజిత్‌కు అండగా ఉంటామని అమరీందర్ భరోసా, ఇమ్రాన్‌ఖాన్ సర్కార్‌పై నిప్పులు
న్యూఢిల్లీ/ అమృత్‌సర్ : పాకిస్థాన్‌లో బలవంతంగా మతమార్పిడికి గురైన యువతులకు అండగా ఉంటామన్నారు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్. జగజిత్ కౌర్ ఇండియా రావాలని ... పంజాబ్ వస్తే వారికి కావాలసిన ఏర్పాట్లు చేస్తామని హామీనిచ్చారు. ఈ అంశంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. బలవంతంగా మత మార్పిడి సరికాదని సూచించారు. ఈ అంశంపై అంతర్జాతీయ సమాజంలో పోరాడాలని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు సూచించారు అమరీందర్ సింగ్.

మత మార్పిడిలు ..
పాకిస్థాన్‌లో బలవంతంగా మత మార్పిడిలు ఏంటి అని ప్రశ్నించారు అమరీందర్ సింగ్. అక్కడ అన్యాయానికి గురైన జగజిత్ కౌర్‌కు న్యాయం చేసేందుకు ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ముందుకురాలేదన్నారు. ఇది సరికాదని మండిపడ్డారు. జగజిత్ కౌర్ అనే అమ్మాయి .. తనకు ఇష్టం లేకుండా మత మార్పిడి చేయడం సరికాదని ట్వీట్ చేశారు. ఆ యువతికి తాను అన్నివిధాలా మద్దతు తెలుపుతానని ప్రకటించారు. ఆమె తన కుటుంబంతో కలిసి ఇండియా రావాలని సూచించారు. పంజాబ్ వస్తే వారికి వసతి సౌకర్యం కల్పిస్తానని స్పష్టంచేశారు.

మిస్సింగ్ .. ఆపై
పాకిస్థాన్‌లో జగజిత్ కౌర్ అనే అమ్మాయి కనిపించలేదు. నాలుగురోజుల తర్వాత ఆచూకీ లభించింది. అయితే ఓ ముస్లిం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత బలవంతంగా మత మార్పిడి చేశాడు. జగజిత్ కౌర్ తంబు సాహిబ్ గురుద్వారాలో మత గురువు కూతురు. ఆమె పాయింట్ బ్లాంకులో తుపాకీ పెట్టి మత మార్పిడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. దీంతో నిన్న సిక్కులు ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ స్పందించారు.

ఖండన ..
జగజిత్ కౌర్ మత మార్పిడిని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు, అకాళిదల్ నేత మజిందర్ సింగ్ సిర్సా ఖండించారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు. ఒక్క జగజిత్ కౌర్ కాదు మరో 30 మంది యువతులు కూడా మత మార్పిడి జరిగిందన్నారు. గత 75 రోజుల్లోనే మత మార్పిడిలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా పరిగణించాలని కోరారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications