పంజాబ్ సీఎంకు తప్పిన ప్రమాదం- ఇంటి సమీపంలో బాంబు గుర్తింపు- చివరి నిమిషంలో..
పంజాబ్ లో ఇవాళ బాంబు కలకలం రేపింది. ఏకంగా సీఎం భగవంత్ మాన్ ఇంటి దగ్గర్లోనే ఈ బాంబును పోలీసులు గుర్తించారు. దీంతో వారు బాంబ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. దాన్ని నిర్వీర్యం చేసి పెద్ద ముప్పును తప్పించారు. అసలు ఈ బాంబును ఎవరు ఇక్కడ పెట్టారు, దీని వెనుక ఎవరున్నారనే దానిపై పంజాబ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చండీఘడ్ లో ఉన్న పంజాబ్, హర్యానా సీఎం నివాసానికి సమీపంలో ఈ బాంబును గుర్తించారు. దీంతో వెంటనే బాంబుస్క్వాడ్ ను పిలిపించి నిర్వీర్యం చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆర్మీ పశ్చిమ కమాండ్ రంగంలోకి దిగి ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతోంది. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఈ ఘటన చోటుు చేసుకుంది. ఓ ట్యూబ్ వెల్ ఆపరేటర్ ముందుగా ఓ బాంబుషెల్ ను పంజాబ్ సీఎం నివాసం, హెలిప్యాడ్ వద్ద గుర్తించారు.

మరోవైపు ఈ ఘటన జరిగిన సమయంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తన నివాసంలో లేరు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ బాంబు ఆయన ఉన్న సమయంలో లేదా రాకపోకలు సాగించే సమయంలో పేలి ఉంటే దారుణం జరిగిపోయేదని అధికారులు తేల్చారు. బాంబు ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఆర్మీ అధికారులతో కలిసి పంజాబ్ పోలీసులు ఘటనా స్దలిని, స్ధానికంగా ఉన్న సీసీ కెమెరాల్ని పరిశీలిస్తున్నారు. బాంబు నిజంగానే సీఎంను టార్గెట్ చేసి పెట్టారా లేక కేవలం భయపెట్టేందుకు ఎవరైనా చేశారా అన్నది తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.












Click it and Unblock the Notifications