CM: సిట్టింగ్ సీఎం మీద కేసు నమోదు చేసిన పోలీసులు, ఐదు ఏళ్లకు ముందు పగ, ఇప్పుడు ప్రతీకారం !
పంజాబ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారిపోయింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయం ముగిసిపోయిన తరువాత కూడా తన అధికారం అడ్డం పెట్టుకుని ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారని ఆరోపణలు రావడంతో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీతో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తి మీద కేసు నమోదు అయ్యింది. గత ఎన్నికల్లో మమ్మల్ని చావుదెబ్బ కొట్టారని ఇప్పటికి రగిలిపోతున్న ఆప్ నాయకులు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది. 2017లో ఆప్ పార్టీ నాన్ లోకల్ అంటూ అందరూ ప్రచారం చెయ్యడంతో పంజాబ్ ఎన్నికల్లో చిత్తూగా ఓడిపోయిన ఆప్ ఇప్పుడు పంజాబ్ లో పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది. పనిలో పనిగా పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఆప్ ఇప్పుడు ఏకంగా సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ మీద కేసు పెట్టింది.

అక్కడ కాంగ్రెస్ కు కాంగ్రెస్ శత్రువు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారిపోయాయి. పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నాయకులే శత్రువులుగా తయారైనారని అందరికి తెలిసిందే. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ బహిరంగంగానే ఇప్పటికే అనేకసార్లు విమర్శలు చేశారు.

ఏకంగా సీఎంను టార్గెట్ చేసిన ఆప్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారిపోయింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయం శుక్రవారం సాయంత్రంతో ముగిసిపోయిన తరువాత కూడా తన అధికారం అడ్డం పెట్టుకుని ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారని ఆరోపణలు రావడంతో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీతో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శుభదీప్ సింగ్ ల మీద ఆప్ పార్టీ నాయకులు ఎన్నికల కమీషన్ కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీఎం మీద కేసు నమోదు చేసిన పోలీసులు
పంజాబ్ లోని మాన్సా జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, పార్టీ లీడర్, మూసేవాలాగా పేరు పొంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శుభదీప్ సింగ్ ల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని స్వయంగా సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ మీద కేసు నమోదు కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు. పంజాబ్ లో ఆదివారం పోలింగ్ జరగనుంది.

ప్రతీకారం తీర్చుకుంటున్న ఆప్
గత ఎన్నికల్లో మమ్మల్ని చావుదెబ్బ కొట్టారని ఇప్పటికి రగిలిపోతున్న ఆప్ నాయకులు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది. 2017లో ఆప్ పార్టీ నాన్ లోకల్ అంటూ అందరూ ప్రచారం చెయ్యడంతో పంజాబ్ ఎన్నికల్లో చిత్తూగా ఓడిపోయిన ఆప్ ఇప్పుడు పంజాబ్ లో పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది. పనిలో పనిగా పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఆప్ ఇప్పుడు ఏకంగా సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ మీద కేసు పెట్టింది.












Click it and Unblock the Notifications