వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సినేషన్ తీసుకోని ఉద్యోగులు ఇంటికే : ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

వ్యాక్సినేషన్లు తీసుకోని వారిని ఉద్యోగాలకు రావద్దంటూ ఏకంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసారు. ఇప్పటికే కేంద్రం- రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవకాశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యత ఇచ్చారు. కానీ, ఇప్పటికీ కొంత మంది ఉద్యోగులు వ్యాక్సినేషన్ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క వ్యాక్సిన్‌ డోస్‌ కూడా వేసుకోని వారు ఇంకా కోట్లలోనే ఉన్నారు. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండడంపై పంజాబ్ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు.

అధికారులతో వ్యాక్సినేషన్ వివరాల పైన ఆరా తీసిన సీఎం కు ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా చాలామంది వ్యాక్సిన్లు తీసుకోలేదనే విషయం అధికారుల ద్వారా తెలుసుకున్నారు. దీంతో..ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోని ఉద్యోగులు సెలవుపై వెళ్లాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు. సెప్టెంబర్‌ 15వ తేదీ తర్వాత ఒక్క వ్యాక్సిన్‌ డోస్‌ కూడా వేసుకోని ఉద్యోగులు ఉంటే వారు సెలవుపై వెళ్లాలని స్పష్టం చేశారు. వారు వ్యాక్సిన్‌ వేసుకునే దాక సెలవుపై ఉండాల్సిందే. వ్యాక్సిన్‌ వేసుకునే కార్యాలయంలోకి అడుగుపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Punjab CM curical decision that govt employees Those who have not been vaccinated not permitted to attend the duties

రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ ఆదేశాలు జారీ చేశారు. కరోనాపై నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు సీఎం అమరీందర్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ ఉద్యోగులందరికీ చేరాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ పూర్తికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. త్వరలో పంజాబ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం పైన ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు..వ్యాక్సినేషన్ ఎంత మందికి ఇవ్వగలిగారనే వివరాలు సేకరిస్తోంది.

ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాలతో జారీ అయిన ఆదేశాలతో ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. వెంటనే వ్యాక్సినేషన్ కోసం పరుగులు తీస్తున్నారు. కరోనా వారియర్స్ తో పాటుగా ఉద్యోగులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. వారికి వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. అయినా, అనేక మంది ఉద్యోగులు వ్యాక్సినేషన్ తీసుకోలేదు. వీరి కారణంగా ఇంకా కరోనా సోకే అవకాశం ఉండటం...వ్యాక్సినేషన్ తీసుకోవటం ద్వారా కరోనా నుంచి తప్పించుకొనే అవకాశం ఉందని తెలిసినా ప్రభుత్వ ఉద్యోగులే ఈ విధంగా చేయటం పైన సీఎం జోక్యం చేసుకున్నారు. దీంతో..ఇప్పుడు పంజాబ్ సీఎం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

English summary
Punjab CM curical decision that govt employees Those who have not been vaccinated not permitted to attend the duties. with CM orders employees move to vaccianation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X