వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

c voter survey: ఆప్‌దే పంజాబ్ పీఠం, సీ ఓటర్ సర్వే.. రెండో స్థానంలో కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

పంజాబ్ పోరులో గెలిచేదేవరు.. ఇదే అంశంపై సర్వేలు చేస్తున్నాయి. అయితే మెజార్టీ మాత్రం కాంగ్రెస్ లేదంటే.. ఆప్‌కు అనుకూలంగా ఉన్నాయి. తాజాగా సీ ఓటర్ కూడా ఓటర్ల మనోగతాన్ని తెలియజేసింది. అయితే సర్వే మాత్రం ఆప్ విజయం దక్కించుకుంటుందని లెక్కగట్టింది. రాష్ట్రంలో అధికారం మార్పు జరుగుతుందని పేర్కొంది.

కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అకాలీదళ్, బీజేపీ, ఇటీవల ఏర్పాటు చేసిన మాజీ సిఎం అమరీందర్ సింగ్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం ఎదురుచూస్తున్నాయి. కానీ సీ ఓటర్ మాత్రం ఆప్‌కు 32 శాతం మంది ఓట్లు వేస్తారని.. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలుస్తోందని తెలిపింది. అధికార పార్టీ 27 శాతం ఓట్లతో వెనుకపడుతుందని వివరించింది. అధికారం తథ్యం అని ధీమాతో ఉన్న అకాలీదల్ 11 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. హంగ్ ఏర్పడే అవకాశం ఉందని 6 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇతరులకు 3 శాతం.. ఇప్పుడే చెప్పలేం అని 21 శాతం మంది అభిప్రాయపడ్డారు.

punjab election 2022 aap may emerge as winner:c voter survey

పంజాబ్ ప్రభుత్వం మారాలని అనుకుంటున్నారా? అని వారిని అడిగితే.. మారాలని అనుకుంటున్నాం- 66 శాతం తమ అభిప్రాయం చెప్పారు. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత తెలిసింది. ప్రభుత్వం మారకూడదని కేవలం 34 శాతం మంది మాత్రం అనుకున్నారు. అంటే సీ ఓటర్ సర్వే ప్రకారం పంజాబ్‌ను ఆప్ గెలుచుకోబోతుంది. ఇదివరకు కూడా ఆప్ మెజార్టీ స్థానాలు సాధిస్తుందని లెక్కలు గట్టారు. సీఎం అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ వైపు ఓటర్లు ఇంట్రెస్ట్ చూపించారు.

ఇటు రైతు సంఘం కూడా పంజాబ్ ఎన్నికల బరిలోకి దిగుతుంది. పంజాబ్‌లో 32 రైతు సంఘాలు ఉండగా.. 22 సంఘాలు ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి. ఈ సంస్థలు పంజాబ్ సంయుక్త సమాజ్ మోర్చా పేరుతో పార్టీని కూడా ప్రకటించాయి. రైతుల పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 117 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. బల్బీర్ సింగ్ రాజేవాల్ రైతుల ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తున్నారు.

English summary
aap may emerge as winner in Punjab assembly elections c voter survey revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X