వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Punjab Elections 2022: ఉగ్రవాదినైతే ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు,కాంగ్రెస్, బీజేపీ అంతా ఒక్కటై: కేజ్రీవాల్

|
Google Oneindia TeluguNews

పంజాబీ ఎన్నికలు పోరుకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈరోజుతో రాష్ట్ర ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడనుంది. ఈ సమయంలో ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురుస్తోంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా గద్దె దించాలని ఆమ్ ఆద్మీ విఫలయత్నాలు చేస్తోంది. ఇక బీజేపీ మాట సరే సరి.

Punjab Elections 2022: నేటితో పంజాబ్ ఎన్నికల ప్రచారానికి తెర.. ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ వివరణPunjab Elections 2022: నేటితో పంజాబ్ ఎన్నికల ప్రచారానికి తెర.. ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ వివరణ

 ఆస్పత్రులు, స్కూల్స్ నిర్మించే మధురమైన ఉగ్రవాదిని నేనే కావచ్చు

ఆస్పత్రులు, స్కూల్స్ నిర్మించే మధురమైన ఉగ్రవాదిని నేనే కావచ్చు

తాజాగా కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీ దర్యాప్తు చేయించాలని సీఎం చన్నీ కోరారు. ఇక తనపై ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ చేసిన ఖలిస్తానీ ఉగ్రవాది ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. తనపై ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలన్నింటినీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఖలిస్తానీ ఉగ్రవాది అని పిలుస్తున్న నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజల కోసం ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించే అత్యంత మధురమైన ఉగ్రవాదిని తానే కావచ్చు అని పేర్కొన్నారు.

తాను ఉగ్రవాదినని చెప్పటం పెద్ద కామెడీ

తాను ఉగ్రవాదినని చెప్పటం పెద్ద కామెడీ


ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ఆయన విరుచుకుపడ్డారు, నేను ఉగ్రవాదిని అని ప్రధాని మోదీకి తెలిస్తే, ఈ ఆరోపణలను ఎందుకు నిరూపించలేదు అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎందుకు దర్యాప్తు చేయలేదు అని ప్రశ్నించారు. అరవింద్ కేజ్రీవాల్ పదేళ్లుగా దేశాన్ని రెండు ముక్కలు చేయాలని, ఒక భాగానికి ప్రధాని కావాలని యోచిస్తున్నారని బిజెపి, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇది కామెడీ అని ఆయన పేర్కొన్నారు. ఈ వాదనను చూసి నవ్వుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

 ఉగ్రవాదినని తెలిస్తే మోడీ ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు, దర్యాప్తు చెయ్యలేదు

ఉగ్రవాదినని తెలిస్తే మోడీ ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు, దర్యాప్తు చెయ్యలేదు

ఇక కాంగ్రెస్ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల అర్థం నేను పెద్ద టెర్రరిస్టుని. ఇంతకీ వారి భద్రతా సంస్థలు ఏం చేస్తున్నాయి? కాంగ్రెస్ కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. వారు నిద్రపోతున్నారా? ప్రధాని నరేంద్ర మోడీ నన్ను ఎందుకు అరెస్టు చేయలేదు? అంటూ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అందరూ ఒక్కటై మూకుమ్మడిగా తనపై దాడి చేస్తున్నారు

అందరూ ఒక్కటై మూకుమ్మడిగా తనపై దాడి చేస్తున్నారు

అన్ని పార్టీలను అవినీతి పార్టీలుగా పేర్కొన్న అరవింద్ కేజ్రీవాల్ పై ఎదురు దాడి చేయడానికి ఇప్పుడు పంజాబ్ లోని "అకాలీదళ్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయి. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ, సుఖ్‌బీర్ బాదల్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ, కెప్టెన్ అమరీందర్ వంటి నేతలందరూ ఒక్కటయ్యారు. ఆప్‌ని ఓడించేందుకు కలిసి రండి అంటూ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించారు.వారంతా ఒకే భాష మాట్లాడుతున్నారు. రాత్రిపూట వీడియో కాల్ లేదా కాన్ఫరెన్స్ కాల్‌లో చాట్ చేస్తున్నట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. అసలు తాము చేసిన తప్పేంటో చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ నిలదీశారు.

ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ ఆరోపణలతో చెలరేగిన వివాదం

ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ ఆరోపణలతో చెలరేగిన వివాదం

అరవింద్ కేజ్రీవాల్ వేర్పాటువాదులకు మద్దతిస్తున్నారని ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ ఆరోపించడంతో వివాదం చెలరేగింది. అరవింద్ కేజ్రీవాల్ "పంజాబ్ సిఎం లేదా ఖలిస్తాన్ ప్రధానమంత్రి" కావాలనుకుంటున్నారని కుమార్ విశ్వాస్ ఆరోపించారు. అయితే, ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా ట్విటర్‌లో కుమార్ విశ్వాస్, అరవింద్ కేజ్రీవాల్‌ను పరువు తీయడానికి , అవహేళన చేయడానికి, కావాలని నకిలీ, కల్పిత వీడియోలను సృష్టించి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Recommended Video

Punjab Elections 2022: పైకి ధీమా..లోపల అంతర్గత సమస్యలు | Election Commission | Oneindia Telugu
అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు

అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు

మరోవైపు ఈ ఆరోపణలపై పలువురు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ నేతలు అరవింద్ కేజ్రీవాల్‌ను విమర్శించారు.అరవింద్ కేజ్రీవాల్‌పై చేసిన ఆరోపణలపై ప్రధాని మోదీ తన స్పందన లో ఈ వ్యక్తులు పంజాబ్‌ను విభజించాలనే కల కంటున్నారని పేర్కొన్నారు. వారు అధికారంలో ఉండటానికి వేర్పాటువాదులతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారు. వారి ఎజెండా పాకిస్తాన్ ఎజెండా కంటే భిన్నంగా లేదు అని ఆరోపణలు గుప్పించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చన్నీ అరవింద్ కేజ్రివాల్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.

English summary
Arvind Kejriwal has questioned why they did not arrest me and not investigated if I'm a terrorist, alleging that Congress and the BJP were unitedly attacking him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X