సీఎంతో పొసగట్లేదు- పదవికి రాజీనామా చేసిన గవర్నర్
Banvarilal Purohit: పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్.. తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి భవన్‌కు పంపించారు. దీన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించాల్సి ఉంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేమిటేది తెలియరావట్లేదు.
పంజాబ్ గవర్నర్, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌కు అడ్మినిస్ట్రేటర్‌గా కొనసాగుతున్నారు బన్వరీలాల్ పురోహిత్. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. ఆయనను రాజ్‌భవన్‌కు పంపించింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.

తొలిసారిగా 2016లో గవర్నర్‌గా అపాయింట్ అయ్యారు. అస్సాం గవర్నర్‌గా పని చేశారు. 2017లో తమిళనాడుకు బదిలీ అయ్యారు. 2021 వరకూ అక్కడ కొనసాగారు. 2021లో పంజాబ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన గవర్నర్‌గా ఉన్నప్పుడే 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
ఎంతో అనుభవం ఉన్న బన్వరీలాల్.. తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. సాధారణంగా తమ పదవీ కాలం ముగిసేంత వరకూ గవర్నర్లెవరూ రాజీనామాలు చేయడం చాలా అరుదు. అలాంటి సందర్భాలు చాలా తక్కువే. కేంద్ర ప్రభుత్వం వారిని రీకాల్ చేస్తుంటుంది.
అలాంటివేవీ జరగనప్పటికీ- బన్వరీలాల్ మాత్రం తన పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వ్యక్తిగత కారణాలతోనే గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన రాష్ట్రపతికి పంపిన లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని ద్రౌపది ముర్ముకు అభ్యర్థించారు.
కాగా- పంజాబ్ ప్రభుత్వంతో తలెత్తిన వివాదాలే ఆయన రాజీనామాకు దారి తీశాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొన్ని బిల్లుల ఆమోదం విషయంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో విభేదాలు ఉన్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications