పోలీసులకు గ్యాంగ్ స్టర్ సవాల్, ముహూర్తం చూసి ఎన్ కౌంటర్, పాకిస్థాన్, చైనాతో !

గ్యాంగ్‌స్టర్ల కేసుల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 2022 నుంచి రెండు ఏళ్ల కాలంలో గ్యాంగ్‌స్టర్లను పంజాబ్ పోలీసులు టార్గెట్ చేశారు. ఇప్పుడు పంజాబ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌లో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ అమృతపాల్ సింగ్ హతమయ్యాడు. అమృతపాల్ సింగ్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి పోలీసులపై కాల్పులు జరిపాడు.

వెంటనే ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు గ్యాంగ్‌స్టర్ అమృతపాల్ సింగ్‌ను కాల్చిచంపారు.

ఇప్పుడు హత్యకు గురైన అమృతపాల్ సింగ్, పంజాబ్ ప్రభుత్వాన్ని షేక్ చేసిన ఖలిస్తానీ ఉగ్రవాది అమృతపాల్ సింగ్ ఇద్దరూ వేరు. 22 ఏళ్ల అమృతపాల్ సింగ్ పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్‌గా నెట్‌వర్క్‌ను చాపకిందనీరులా పెంచుకున్నాడు. అమృత్‌సర్‌లోని జండియాలా సమీపంలో పోలీసులు కాల్పులు జరిపారు.

Punjab police killed a gangster who was doing drug trade and killing in an encounter

హెరాయిన్, ఇతర డ్రగ్స్ విక్రయిస్తూ పంజాబ్ పోలీసులకు తలనొప్పిగా మారిన అమృతపాల్ సింగ్ మూడు హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇంతకాలం పోలీసులకు తప్పించుకుని తిరుగుతున్న గ్యాంగ్ స్టర్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారైనాడు. అయితే నిందితుడు అమృతపాల్ సింగ్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు అమృతపాల్ సింగ్‌ను చుట్టుముటి లొంగిపోవాలని అతనికి సూచించారు.

అయితే అమృతపాల్ సింగ్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి పిస్టల్‌తో పోలీసులకు మీద కాల్పులు జరిపాడు. కొందరు పోలీసులకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుదాడికి దిగి తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో గ్యాంగ్ స్టర్ అమృతపాల్ సింగ్ తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయాడు.

అమృతపాల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే స్థానిక ఆసుపత్రికి అతన్ని తరలించారు.

అయితే తీవ్రంగా గాయపడిన గ్యాంగ్‌స్టర్ అమృతపాల్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్యాంగ్ స్టర్ అమృతపాల్ సింగ్ నుంచి 2 కిలోల హెరాయిన్ (డ్రగ్స్), 2 పిస్టల్స్, మరికొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఇది చైనీస్ మేడ్ పిస్టల్ అని పోలీసులు అన్నారు.

Punjab police killed a gangster who was doing drug trade and killing in an encounter

పాకిస్థాన్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్న అమృతపాల్ సింగ్ వ్యాపారం చేస్తున్నాడు. పాకిస్థాన్ నుంచి అక్రమంగా డ్రగ్స్ తెచ్చి పంజాబ్ లో విక్రయిస్తున్నాడు. ఇందుకోసం చాలా మంది ఏజెంట్లను నియమించాడు. అమృతపాల్ సింగ్ నెట్‌వర్క్ ఎక్కువగా పంజాబ్‌లో పనిచేస్తోందని, అందరి గురించి ఆరా తీస్తున్నామని పంజాబ్ పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+