Punjab Poll:30 మందితో కేజ్రీవాల్ సెకండ్ లిస్ట్, మొత్తం 40 మంది, ఇలా టికెట్ల కేటాయింపు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ ఫోకస్ చేసింది. గతంలో ఊహించిన దాని కన్నా ఎక్కువ స్థానాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి అంతకన్నా ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని అనుకుంటోంది. ఆ మేరకు అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నాలు చేస్తున్నారు. పంజాబ్‌‌లో పర్యటిస్తూ.. జనాన్ని తనవైపునకు తిప్పుకునే పనిలో బిజీగా ఉన్నారు. తనను టార్గెట్ చేస్తోన్న పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూను కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు.

సెకండ్ లిస్ట్

సెకండ్ లిస్ట్


తొలుత 10 మంది అభ్యర్థులతో ఆప్ లిస్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో 30 మంది క్యాండెట్లను రిలీజ్ చేసింది. పంజాబ్ మాజీ పోలీస్ ఆఫీసర్ కున్వార్ విజయ్ ప్రతాప్ సింగ్‌కు జాబితాలో చోటు దక్కింది. కొట్కాపుర, బెహబాల్ కాలాన్ ఫైరింగ్ కేసుల ప్రత్యేక దర్యాప్తు బృందానికి ప్రతాప్ నేతృత్వం వహించాడు. గత ఏప్రిల్‌లో తన ఉద్యోగానికి సింగ్ రాజీనామా చేశారు. అమృత్ సర్ నార్త్‌ టికెట్‌ను ఆయన ఆశించారు.

వీరికే టికెట్

వీరికే టికెట్


రామన్ బెహల్‌కు కూడా టికెట్ కేటాయించింది. గత నెలలో కాంగ్రెస్ పార్టీని వీడి.. ఆప్‌లో చేరిన సంగతి తెలిసిందే. గురుదాస్ పూర్ నుంచి బరిలో నిలిచే చాన్స్ ఉంది. పటాన్ కోట్ నుంచి విభుతి శర్మ, ఖరార్ నుంచి అన్‌మోల్ గగన్ మాన్, రాంపూర ఫుల్ నుంచి బల్కార్ సింగ్ సిద్దూ పోటీ చేస్తారు. పంజాబ్ మాజీ మంత్రి సేవా సింగ్ సెఖ్వాన్ కుమారుడు జగ్‌రూప్ సింగ్ ఖదియాన్ నుంచి పోటీ చేస్తారు.

గెలుపు గుర్రాలు

గెలుపు గుర్రాలు


కర్తార్ పూర్ నుంచి డీసీపీ బల్కార్ సింగ్, అమృత్ సర్ దక్షిణం నుంచి డాక్టర్ ఇందర్‌బీర్ సింగ్ నిజ్జర్, ఫతేగడ్ చురియన్ నుంచి బల్బీర్ సింగ్ పన్ను, బాటాలా నుంచి షెరీ కల్సీ, ఫరీద్ కోట్ నుంచి గుర్దీత్ సింగ్ షెకాన్, షామ్ చౌరాసీ నుంచి రావ్‌జ్యోత్ సింగ్, నావన్ షార్ నుంచి లలిత్ మోహన్, లుదియానా ఈస్ట్ నుంచి దల్జీత్ సింగ్ పోటీ చేస్తారు. ఆటమ్ నగర్ నుంచి కుల్వంత్ సింగ్ సిద్దూ, పాయల్ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి మన్విందర్ సింగ్, జిరా నుంచి నరేశ్ కటారియా, ముక్త్సార్ నుంచి జగ్ దీప్ సింగ్, రాజ్‌పురా నుంచి నీనా మిట్టల్, సనోర్ నుంచి హర్మిత్ సింగ్, సామానా నుంచి చేతన్ సింగ్, లుదియానా నార్త్ నుంచి చేతన్ సింగ్ పోటీ చేస్తారు. పంజాబ్‌లో 117 అసెంబ్లీ సీట్లు ఉన్న సంగతి తెలిసిందే.

విజయమో

విజయమో

వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలో చేపట్టాలని ఆప్ భావిస్తోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ వరసగా పంజాబ్ పర్యటనలు చేస్తూ అక్కడి పార్టీ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. పంజాబ్ ఓటర్లను ఆకట్టుకునేలా ముందుకు సాగుతున్నారు. అయితే కేజ్రీవాల్ బలపడితే తమకు నష్టం తప్పదని భావిస్తున్న కాంగ్రెస్.. రాష్ట్రంలో అధికారాన్ని ఎట్టిపరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని అనుకుంటుంది. ఆమ్ ఆద్మీ వైపుకి ఓటర్లు మళ్లకుండా చూసే ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం నివాసం వద్ద ఢిల్లీ గెస్ట్ టీచర్లు చేసిన నిరసనలో సిద్ధూ పాల్గొన్నారు. తర్వాత కేజ్రీవాల్ వర్సెస్ సిద్దూ మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయికి చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+