భూకంపం: బెంగాల్‌లో ఆరుబయటే పరీక్ష రాసిన విద్యార్ధులు...!

కోల్‌కత్తా: నేపాల్‌లో తాజాగా సంభవించిన భూప్రకంపనలు ప్రభావం భారత్‌పై కూడా పడింది. దీంతో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో ఓపాఠశాలలో విద్యార్ధులు పరీక్ష రాస్తుండగా భూమి కంపించింది. దీంతో ఆందోళనకు లోనైన ఉపాధ్యాయులు వెంటనే విద్యార్ధులను పరీక్షా కేంద్రం నుంచి బయటకు పంపించారు.

భూ ప్రకంపనలు ఆగిన తర్వాత ఉపాధ్యాయులు ఆరు బయటే విద్యార్ధుల చేత పరీక్ష రాయించారు. ఈరోజు మధ్యాహ్నాం భారత్‌లోని ఢిల్లీ, బీహార్, పశ్చిమబెంగాల్, అసోం, పంజాబ్, జార్ఖండ్, యూపీ, మధ్యప్రదేశ్‌లో తీవ్ర భూప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే.

Punjab School Education Board (PSEB) Class 12 results announced

మంగళవారం మధ్యాహ్నం 12.38 గంటలకు 60 సెకన్లపాటు భూమి కంపించడంతో భయాందోళనకు లోనైన ప్రజలు ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్ రాజధాని ఖాట్మండ్‌లో భూ ఉపరితలానికి 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం అధీకృతమైనట్టు భూగర్భశాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇది ఇలా ఉంటే సోమవారం వెలువడిన పంజాబ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో బాలుర కంటే బాలికలే మెరుగైన ప్రతిభను ప్రదర్శించారు. పంజాబ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు ఛైర్‌పర్సన్‌ తేజిందర్‌ కౌర్‌ ధలివాల్‌ మాట్లాడుతూ ఫలితాల్లో 76.24 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మొదటి మూడు స్థానాల్లో బాలికలే నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+