ఆ ప్రాంతాల్లో పురంధేశ్వరి ప్రచారం, శశికళ-దినకరన్‌లపై దీపక్ సంచలనం
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ తరఫున మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి ప్రచారం చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఆమె కోరుతున్నారు.

ఆర్కే నగర్‌లో పురంధేశ్వరి ప్రచారం
ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని పురంధేశ్వరి కోరారు. ముఖ్యంగా తెలుగు వారు ఉన్న ప్రాంతాల్లో పురంధేశ్వరి ప్రచారం నిర్వహిస్తున్నారు. వారిని బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నారు.

దినకరన్‌పై జయ కుమార్ సంచలనం
జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్.. శశికళ వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న దినకరన్ పెద్ద మోసగాడు అన్నారు. జయకు శశికళ స్నేహితురాలు మాత్రమేనని, రాజకీయ వారసురాలు కాదన్నారు. గతంలో ఆయన శశికళకు అనుకూలంగా కనిపించారు.

వారసులు పన్నీరుసెల్వమే
పార్టీతో పాటు ప్రభుత్వాన్ని నడిపించే అధికారం శశికళ వర్గానికి లేదని చెప్పారు. జయలలితకు నిజమైన రాజకీయ వారసులు పన్నీరు సెల్వం, మధుసూదనన్ మాత్రమేనని చెప్పారు. జయ ఎఫ్పుడూ వారసులను రాజకీయాల్లోకి తీసుకు రాలేదన్నారు. ఆమెకు వారసత్వ రాజకీయాలు ఇష్టం లేదన్నారు.

వారే గెలుస్తారు
జయలలిత ఫోటోతో ప్రచారం చేసుకునే అర్హత దినకరన్‌కు లేదని దీపక్ జయకుమార్ తేల్చి చెప్పారు. అధికారం చేపట్టాలని భావిస్తున్న దినకరన్ కలలు కల్లలు అవుతాయన్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అమ్మ (జయలలిత) విశ్వాసపాత్రులు గెలుస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications