పూరీ రథయాత్రలో అపశృతి: ఒకరి మృతి, వందల మందికి గాయాలు

ఒడిశా రాష్ట్రంలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. రథం లాగుతుండగా తోపులాట జరగడంతో ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది భక్తులకు గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

వైభవంగా జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుని రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది. ఒడిశాతో పాటు దేశంలోని నలు మూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీక్షేత్రం పరిసరాలతో పాటు అక్కడి వీధులన్నీ 'జై జగన్నాథ' నినాదాలతో మార్మోగాయి. ఆదివారం సాయంత్రం జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర వారి రథాలు నందిఘోష, తాళధ్వజం, పధ్వధ్వజం రథాలపై తల్లి చెంతకు పయనమయ్యారు.

Puri Jagannath Rath Yatra one Devotee dies of suffocation several injured in stampede

తొలుత బలభధ్రుడు తాళధ్వజ రథంపై తల్లి చెంతకు పయనమయ్యారు. ఆ తర్వాత దేవీ సుభద్రదేవీ, చివరిగా పురుషోత్తముని నందిఘోష్‌ రథం భక్త జన సాగరంలో నెమ్మదిగా ముందుకు కదిలింది. భక్తజన ఘోష మధ్య పూరీ బొడొదండోలో జగన్నాథుడు దర్శనమిచ్చారు.

రథయాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పూరీ జగన్నాథ రథయాత్ర తొలిసారి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. మూడు రథాల 'పరిక్రమ' చేసి దేవతలకు నమస్కరించారు. ఒడిశా ముఖ్యమంత్రి చరణ్ మాఝీ, మాజీ సీఎం నవీన్​ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జగన్నాథ రథం తాళ్లను లాగి లాంఛనప్రాయంగా యాత్ర ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు రథయాత్రలో పాల్గొని భక్తపారవశ్యులయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+