భర్త మీద కోపం, మద్యం మత్తులో విమానంలో మహిళ రభస, చెన్నైలో దించేసి వెళ్లిపోయారు!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తప్పతాగిన ఓ మహిళ భర్త మీద కోపంతో విమానంలో చేసిన రభస కారణంగా సాటి ప్రయాణికులు నానా ఇబ్బంది పడ్డారు. ఆ మహిళ చేసిన రభసకు ఏకంగా విమానాన్నే దారి మళ్లించాల్సి వచ్చింది. చేసేది వేరే దారిలేక ఆమెతో సహ ఆ కుటుంబాన్ని చెన్నైలో దించేసి అనంతరం విమానం బయల్దేరి వెళ్లిపోయింది.

ఖతార్ ఎయిర్ వేస్ కు చెందిన QR-962 దోహ నుంచి బాలి బయలుదేరిన విమానంలో ఇరాక్ కు చెందిన ఓ మహిళ తన భర్త, బిడ్డతో సహ బయలుదేరింది. భర్త మీద చాలాకాలంగా అనుమానంతో ఉన్న ఆమె తన భర్త మొబైల్ ని రహస్యంగా చూడాలని భావించింది.

Qatar airways Doha to Bali extramarital affair mida air flight diversion Chennai in Tamil Nadu

వేలిముద్రతో మాత్రం ఆన్ అయ్యే ఆ మొబైల్ ను ఎలాగైనా చూడాలి అని ఆలోచించింది. విమానంలో భర్త నిద్రపోతున్న సమయంలో అతని వేలి ముద్రతో మొబైల్ ఆన్ చేసింది. అంతే తన భర్త నన్ను మోసం చేస్తున్నాడని గుర్తించి శివాలెత్తిపోయింది.

అప్పటికే మద్యం తాగి ఉన్న ఆమె విమానంలో నానా రభస చేసింది. విమాన సిబ్బంది ఎంత చెప్పినా ఆమె మాట వినలేదు. విమాన సిబ్బంది మీద ఆమె దురుసుగా ప్రవర్తించింది. ఇక ఆమెను అదుపు చెయ్యలేమని నిర్ణయించిన సిబ్బంది విమానాన్ని దారి మళ్లించి చెన్నైలో దించేశారు. ఇరాన్ మహిళ కుటుంబాన్ని చెన్నైలో దించేసి విమానం వెళ్లిపోయిందని సీఐఎస్ఎఫ్ సిబ్బంది చెప్పారు. మరో విమానంలో ఇరాన్ మహిళ కుటుంబాన్ని కౌలాలంపూర్ పంపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Qatar Airways flight QR-962 (Doha-Bali) was diverted to Chennai. A lady along with her husband and a child, all Iranian nationals, were offloaded by the airline, which had no stopover, as the woman created a ruckus and misbehaved with crew members inflight," said a senior security officer.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి